Homeతెలంగాణహైదరాబాద్kidnap: అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్

kidnap: అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్

Attapur: హైదరాబాద్‌ని అత్తాపూర్ పరిధిలో కిడ్నాప్ ఉదంతం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం అందరూ చూస్తుండగానే ఓ యువతిని దుండగులు అపహరించుకుపోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

- Advertisement -

సినిమా ఫక్కీలో కిడ్నాప్: స్థానికులు మరియు సాక్షుల కథనం ప్రకారం.. థార్ కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా యువతిపై పడ్డారు. పరిసరాల్లో జనాలు ఉన్నప్పటికీ.. ఏమాత్రం భయం లేకుండా అందరూ చూస్తుండగానే సదరు యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

రంగంలోకి దిగిన డీసీపీ: స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రాజేంద్రనగర్ జోన్ డీసీపీ శ్రీనివాస్ పోలీసు బలగాలతో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించిన ఆయన.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ (CCTV) ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కారు నంబర్ మరియు దుండగుల ఆనవాళ్లను గుర్తించే పనిలో పడ్డారు.

Also read-Lulu Mall: మిక్చర్‌లో బల్లి.. లులు మాల్‌లో ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు.. కల్తీ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే.!

పరిచయం ఉన్న వ్యక్తులే కిడ్నాప్‌: ప్రాథమిక విచారణలో ఆ యువతికి.. కారులో వచ్చిన యువకులకు ముందే పరిచయం ఉన్నట్లు కొందరు సాక్షులు పోలీసులకు తెలిపారు. దీంతో.. ఇది నిజంగానే కిడ్నాపా? లేక వ్యక్తిగత గొడవలు లేదా ప్రేమ వ్యవహారాల కారణంగా ఈ ఘటన జరిగిందా? అనే అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News