Money laundering case: భూదాన్ భూముల అక్రమ కేటాయింపుల వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ మరోసారి ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈ భూముల బదలాయింపులో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ ఈ విచారణను వేగవంతం చేసింది.
సేల్ డీడ్ వివరాలతో విచారణకు..: అమోయ్ కుమార్‌ను ఈడీ గతంలోనూ విచారించింది. అయితే ఈసారి విచారణకు వచ్చేటప్పుడు వివాదాస్పద భూములకు సంబంధించిన పూర్తి సేల్ డీడ్ పత్రాలతో పాటు ఇతర రికార్డులను వెంట తీసుకురావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఆయన అవసరమైన పత్రాలతో హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
Also read-KTR fires: మోదీ ఒత్తిడికి తలొగ్గి మోటార్లకు మీటర్లు బిగించే కుట్ర.. రేవంత్ సర్కారుపై కేటీఆర్ ఫైర్
ప్రధాన ఆరోపణలు ఇవే: నిరుపేదలకు చెందాల్సిన సుమారు 42 ఎకరాల భూదాన్ భూములను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారనేది అమోయ్ కుమార్‌పై ఉన్న ప్రధాన ఆరోపణ. అంతే కాకుండా ఈ భూముల కేటాయింపుల వెనుక భారీగా నిధుల మళ్లింపు జరిగినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. ఇందులో ఎవరెవరికి వాటాలు అందాయనే కోణంలో అధికారులు అమోయ్‌ను విచారిస్తున్నారు. అమోయ్ కుమార్ గతంలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల కలెక్టర్‌గా పనిచేసిన కాలంలోనే ఈ భూముల కేటాయింపులు జరిగినట్లు తెలుస్తోంది.

