Tuesday, February 17, 2026
HomeతెలంగాణiBOMMA Ravi: ఐదు సార్లు చుక్కెదురు.. బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఐబొమ్మ రవి.!

iBOMMA Ravi: ఐదు సార్లు చుక్కెదురు.. బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఐబొమ్మ రవి.!

iBOMMA Ravi High Court: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఇప్పటికే నాంపల్లి కోర్టులో పలుమార్లు రవి బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడంతో వాటి న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో రవి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/top-stories/former-minister-harish-rao-reacted-to-kcr-receiving-sit-notices/

సినిమా పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. గతంలో రవి నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఐదు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కేసు తీవ్రత దృష్ట్యా కొట్టివేయగా.. తాజాగా, రవి తన న్యాయవాది ద్వారా హైకోర్టులో కొత్తగా బెయిల్ పిటిషన్‌ వేశాడు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. రవికి బెయిల్ ఇచ్చే అంశంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/manthena-satyanarayana-raju-health-education-schools-amaravati-naturopathy-university/

కాగా తమ వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారు. నిందితుడికి విదేశీ పౌరసత్వం(ఫ్రాన్స్) ఉందని, బెయిల్ ఇస్తే దేశం దాటి పారిపోయే అవకాశం ఉందని గతంలో పోలీసులు వాదించిన విషయం తెలిసింది. ఈ క్రమంలో తదుపరి విచారణలో భాగంగా మంగళవారం పోలీసులు తమ కౌంటర్‌ను దాఖలు చేయనున్నారు. బెయిల్ ఇవ్వకూడదని వాదనలు వినిపించనున్నారు. 

పైరసీ ద్వారా చిత్ర పరిశ్రమకు భారీ నష్టం చేకూర్చారనే ఆరోపణలతో ఐబొమ్మ రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద నాలుగు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News