HomeTop StoriesTG Municipalities: ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీల ఎన్నిక పూర్తి.. గెలుపు ఆ పార్టీదే.!

TG Municipalities: ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీల ఎన్నిక పూర్తి.. గెలుపు ఆ పార్టీదే.!

Telangana municipality elections: తెలంగాణలో వాయిదా పడుతూ వచ్చిన పలు మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియ ఈ రోజు ముగిసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల ఛైర్మన్ పదవులను బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/cinema-news/ranbir-kapoor-revealed-he-palys-dual-role-in-ramayana-movie/

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి బీఆర్‌ఎస్‌కు చెందిన టెకుల సుదర్శన్ రెడ్డి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆకుల యాదగిరి పోటీ చేయగా, అధికారులు ఓటింగ్ నిర్వహించి సుదర్శన్ రెడ్డిని విజేతగా ప్రకటించారు. అయితే, ముగ్గురు కౌన్సిలర్లపై కోర్టు కేసులు ఉన్నాయన్న కారణంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఈ ఎన్నికను బహిష్కరించి వాకౌట్ చేశారు. ఇక్కడ బీజేపీకి చెందిన ముత్యాల శ్యామల భాస్కర్ వైస్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

Also Read: https://teluguprabha.net/telangana/mla-kaushik-reddy-to-be-investigated-by-cid/

ఇక, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలోనూ బీఆర్‌ఎస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. సంధ్యారాణి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఈ విజయానికి సీపీఐ మద్దతు కూడా తోడైంది. కాంగ్రెస్ కౌన్సిలర్లు ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News