Homeఆంధ్రప్రదేశ్IMD: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. 72 గంటల పాటు..

IMD: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. 72 గంటల పాటు..

IMD: వేసవి ఎండలు దంచికొడుతున్న వేళ వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రాల్లో ఎండలు, వర్షాలతో భిన్న పరిస్థితులు ఉంటాయిన తెలిపింది. కాగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజలు వాతావరణంలో భిన్న పరిస్థితులు చూసతున్నారు. ఓ వైపు భారీ ఉష్ణోగ్రతలు, మరోవైపు వర్షాలు. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఈ భిన్నవాతావరణంలో ఇరు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

- Advertisement -

తీవ్ర ఉష్ణోగ్రతలు, వర్షాలు..
ఈ క్రమంలో వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చింది. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బలమైన ఈదురు గాలులు సహా పిడుగులతో కూడిన జల్లులు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. వడగాలులు ముప్పు కూడా పొంచి ఉందని తెలిపింది. ఇందుచేత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావారణ శాఖ సూచించింది.

Also Read: Gas Prices: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

ఈసారి ముందుగానే రుతుపవనాలు
ఏపీలో శుక్ర, శనివారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడం సహా గంటకు సుమారు 40 – 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలో వేడి, తేమ సహా అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాగల మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు వర్షాలతో ఇదే తరహా వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. మరోవైపు వాతావరణ శాఖ చల్లని కబురు కూడా అందించింది. ఈ ఏడాది కాస్తా ముందుగానే రుతుపవనాలు ప్రవేశిస్తాయని మే రెండో లేదంటే మూడో వారం తీరాన్ని తాకుతాయని తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News