HomeతెలంగాణTelangana: మీసేవ యూజర్ చార్జీల పెంపు.. నేటి నుంచే అమలు!

Telangana: మీసేవ యూజర్ చార్జీల పెంపు.. నేటి నుంచే అమలు!

Mee seva: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ (MeeSeva) కేంద్రాల్లో వివిధ ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన యూజర్ చార్జీలను పెంచుతూ రేవంత్‌ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని సేవలపై సుమారు 50 శాతం ధరలు పెంచారు. ఆదాయ, కుల, స్థానికత వంటి సర్టిఫికెట్ల జారీకి యూజర్ చార్జీలుగా రూ.80 చేశారు. జనన ధ్రువీకరణ పత్రం ప్రింట్‌ ఇవ్వడానికి రుసుం రూ.62 చేశారు.

- Advertisement -

ధరల సవరణ వివరాలు: ఏ-కేటగిరీ సేవలు (తక్షణమే లభించే సర్టిఫికెట్ ప్రింట్లు) పొందేందుకు గతంలో ఉన్న రూ. 35 ధర ఉండగా ప్రస్తుతం రూ. 62 కు పెంచారు. బి-కేటగిరీ సేవల (ఆదాయం, కుల, నివాస ధృవీకరణ పత్రాలు) ధరను రూ. 80 గా నిర్ణయించారు.

నేటి నుంచే అమలు?: కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజైన ఏప్రిల్ 1 నుంచే ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. మీసేవ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, గత కొన్నేళ్లుగా చార్జీల సవరణ జరగకపోవడంతో మీసేవ నిర్వాహకులు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also read-National Awards: తెలంగాణ పల్లెల జోరు.. మోతుకుపల్లి, ఫసల్వాడికి జాతీయ పురస్కారాలు!

ప్రజల్లో ఆందోళన: నిత్యం విద్యార్థులు, రైతులు, సామాన్యులు ఎక్కువగా ఉపయోగించే ఆదాయ, కుల ధృవీకరణ పత్రాల ధరలు ఇలా ఒక్కసారిగా పెరగడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలపై ఇది పెను భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News