Telangana Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఊతం లభించింది. సొంత ఇల్లు లేని పేదల కలను సాకారం చేసే లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రాజెక్టుకు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద భారీగా నిధులు మంజూరు కానున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణలో సుమారు 4.13 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం తన వంతు ఆర్థిక సాయాన్ని అందించబోతోంది.
Speaker Chair : మైసూరు కళ…. కర్ణాటక కుర్చి పై మనసుపడ్డ మహానా!
కేంద్రం నుంచి అందునున్న ఆర్థిక సాయం
కేంద్ర ప్రభుత్వం తన పీఎంఏవై (PMAY) పథకాన్ని ఇందిరమ్మ ఇళ్లకు అనుసంధానం చేస్తూ నిధులను విడుదల చేయనుంది. నగరాలు , పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు కేంద్రం తన వాటాగా రూ. 1.50 లక్షలు అందించనుంది. పల్లెల్లో ఇల్లు నిర్మించుకునే వారికి కేంద్రం నుండి రూ. 72 వేలు అందుతాయి. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసే మొత్తంలో కలుపుతారు, దీనివల్ల రాష్ట్ర ఖజానాపై కొంత భారం తగ్గనుంది.
విడతల వారీగా రూ. 5 లక్షల నగదు
తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇందిరమ్మ ఇంటికి మొత్తం రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని లబ్ధిదారులకు ఒకేసారి కాకుండా, ఇంటి నిర్మాణ దశలను బట్టి విడతల వారీగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు.
ఇల్లు ప్రారంభించినప్పుడు మొదటి విడత. గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత రెండో విడత. ఇల్లు పూర్తిగా సిద్ధమైనప్పుడు మిగిలిన నగదును అందజేస్తారు. తద్వారా నిధులు దుర్వినియోగం కాకుండా నేరుగా నిర్మాణ పనులకే ఖర్చు అయ్యేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
పేదల సొంతింటి కల వైపు అడుగులు
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి సుమారు 3,500 ఇళ్లను ప్రాథమికంగా కేటాయించిన ప్రభుత్వం, ఇప్పుడు కేంద్ర నిధుల రాకతో ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది. స్థలం ఉండి ఇల్లు లేని వారికే కాకుండా, నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మరీ ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. పారదర్శకత కోసం గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ ఇప్పటికే ముమ్మరంగా సాగుతోంది.
Ambati Rambabu: నల్లపాడు పీఎస్..గడ్డపారతో ‘అంబటి’ కోసం వెతుకులాట

