Wednesday, March 11, 2026
HomeతెలంగాణTelangana: కుల వివక్ష నిర్మూలనే లక్ష్యం.. కులాంతర వివాహాలపై మంత్రి వ్యాఖ్యలు!

Telangana: కుల వివక్ష నిర్మూలనే లక్ష్యం.. కులాంతర వివాహాలపై మంత్రి వ్యాఖ్యలు!

inter caste Incentive Scheme: కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్‌ ‘ఇంటర్ క్యాస్ట్ ఇన్సెంటివ్ స్కీమ్’ను సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన జంటలకు ప్రభుత్వం రూ. 2.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది.

- Advertisement -

పథకం నిబంధనలు ఇవే: వివాహం చేసుకున్న జంటలో వధువు లేదా వరుడు.. ఎవరో ఒకరు తప్పనిసరిగా ఎస్సీ (SC) సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి. సదరు వివాహం చట్టబద్ధంగా రిజిస్టర్ అయి ఉండాలి.

రికార్డు స్థాయిలో ఈ ఏడాది సహాయం: తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు (గడిచిన 12 ఏళ్లలో) మొత్తం 13,419 కులాంతర వివాహాలకు గానూ రూ. 238.17 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా గత ఏళ్లతో పోలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా లబ్ధి చేకూరింది.

గత ఐదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే:

  • 2021-22 ఆర్థిక సంవత్సరంలో 563 జంటలకు రూ. 13.72 కోట్లు అందించారు.
  • 2022-23 ఆర్థిక సంవత్సరంలో 418 జంటలకు రూ. 10.45 కోట్లు అందించారు.
  • 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 6.07 కోట్లు అందించారు.
  • 2024-25 ఆర్థిక సంవత్సరంలో 383 జంటలకు రూ. 9.58 కోట్లు అందించారు.
  • 2025-26 (ఇప్పటివరకు) ఆర్థిక సంవత్సరంలో 1,259 జంటలకు రూ. 31.48 కోట్లు అందించారు.

సామాజిక సంకల్పంతో ముందుకు: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేకూరేలా పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా.. కుల వివక్షను తొలగించే దిశగా ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1,259 జంటలకు రూ. 31.48 కోట్లు విడుదల చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News