HomeతెలంగాణTelangana: నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

Telangana: నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

Intermediate Exams: తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుంచి మే 28వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 889 కేంద్రాలను ఏర్పాటు చేయగా, సుమారు 3,98,358 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో ఫస్టియర్ విద్యార్థులు 2,67,285 మంది కాగా.. సెకండియర్ విద్యార్థులు 1,31,073 మంది ఉన్నారు.

- Advertisement -

పరీక్షల సమయం:

  • ఫస్ట్ ఇయర్: ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు.
  • సెకండ్ ఇయర్: మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు.

Also read-Import Duty: బంగారంపై కేంద్రం షాక్.. దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేసిన మోదీ సర్కార్

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ: నిబంధనల విషయంలో అధికారులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని బోర్డు స్పష్టం చేసింది. కావున విద్యార్థులు నిర్ణీత సమయం కంటే ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News