IPS Transfers before Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 32 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఏడీజీ పర్సనల్‌గా చౌహాన్, సీఐడీ డీఐజీగా పరిమిళా నూతన్, మహేశ్వరం డీసీపీగా నారాయణ రెడ్డి, తెలంగాణ నార్కొటిక్ ఎస్పీగా పద్మ, నాగర్ కర్నూలు ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్, సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ కారే, మహబూబాబాద్ ఎస్పీగా శబరీష్, అసిఫాబాద్ ఎస్పీగా నిఖితాపంత్, వికారాబాద్ ఎస్పీగా స్నేహా మిశ్రా, హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్, ములుగు ఎస్పీగా సుధీర్, భూపాలపల్లి ఎస్పీగా సంకేత్, వనపర్తి ఎస్పీగా సునీత, మల్కాజిగిరి డీసీపీగా శ్రీధర్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా మొత్తం 32 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేసినట్లు తెలిపింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/telangana-cabinet-meet-on-local-body-elections/

