HomeతెలంగాణIPS Transfers: బ్రేకింగ్‌ న్యూస్‌.. తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ.. జోన్ల వారీగా పూర్తి వివరాలివే.!

IPS Transfers: బ్రేకింగ్‌ న్యూస్‌.. తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ.. జోన్ల వారీగా పూర్తి వివరాలివే.!

IPS Transfers in Telangana: తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఇప్పటికే పలుమార్లు భారీ స్థాయిలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. త్వరలోనే జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏకంగా 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసి, కొత్త పోస్టింగ్‌లు ఇచ్చింది ప్రభుత్వం. తాజా ఉత్తర్వుల ప్రకారం, జోన్ల వారీగా ఐపీఎస్‌ల బదిలీలను పరిశీలిద్దాం.

- Advertisement -

జోన్ల వారీగా ఐపీఎస్‌ల బదిలీ జాబితా..

1. హైదరాబాద్‌ సౌత్ రేంజ్ అదనపు కమిషనర్‌గా తస్వీర్ ఇక్బాల్‌ నియామకం
2. హైదరాబాద్‌ నార్త్‌రేంజ్‌ జాయింట్ కమిషనర్‌గా శ్వేత
3. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్‌ జాయింట్ కమిషనర్‌గా విజయ్‌కుమార్
4. కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీగా కోటిరెడ్డి
5. ఫ్యూచర్‌ సిటీ మహేశ్వరం జోన్ డీసీపీగా నారాయణ్‌రెడ్డి
6. సికింద్రాబాద్ జోన్ డీసీపీగా రక్షిత మూర్తి
7. ఉప్పల్ జోన్ డీసీపీగా సురేష్‌కుమార్‌
8. చార్మినార్ జోన్ డీసీపీగా కారే కిరణ్‌
9. ఎల్బీనగర్‌ డీసీపీగా అనురాధ
10. చేవెళ్ల డీసీపీగా యోగేష్‌ గౌతమ్‌
11. కూకట్‌పల్లి డీసీపీగా రితిరాజ్‌
12. శేరిలింగంపల్లి డీసీపీగా చింతమనేని శ్రీనివాస్
13. సిద్దిపేట సీపీగా రేష్మి పెరుమాళ్
14. మల్కాజ్‌గిరి డీసీపీగా సీహెచ్‌ శ్రీధర్‌
15. ఖైరతాబాద్ డీసీపీగా శిల్పవల్లి
16. రాజేంద్రనగర్‌ డీసీపీగా ఎస్‌ శ్రీనివాస్‌
17. గోల్కొండ జోన్ డీసీపీగా చంద్రమోహన్
18. జూబ్లీహిల్స్‌ జోన్ డీసీపీగా రమణారెడ్డి
19. శంషాబాద్ జోన్ డీసీపీగా బి. రాజేష్‌
20. షాద్‌నగర్‌ జోన్ డీసీపీగా శిరీష

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News