HomeతెలంగాణKomatireddy: ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్ర.. కోమటిరెడ్డిపై తప్పుడు వార్తలను ఖండిస్తున్నా.. జగ్గారెడ్డి ఫైర్

Komatireddy: ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్ర.. కోమటిరెడ్డిపై తప్పుడు వార్తలను ఖండిస్తున్నా.. జగ్గారెడ్డి ఫైర్

Jaggareddy on Komatireddy Venkat Reddy Issue: తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మీడియాలో ప్రచురితమైన నిరాధార కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎదుటి వ్యక్తిపై బురద జల్లే ఇలాంటి సంప్రదాయం ఏమాత్రం మంచిది కాదన్నారు. ఎవరైనా దురుద్దేశపూర్వకంగా అలాంటి వార్తలు రాయాలని ప్రోత్సహించినా అది సరికాదన్నారు. మంత్రిపై అలాంటి రాతలు ఎవరైనా ప్రోత్సహిస్తే అది చాలా పెద్ద తప్పు అవుతుందన్నారు. ఉద్దేశపూర్వకంగా కథనం రాసిన వారితో పాటు ప్రేరేపించిన వారిది కూడా తప్పే అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంచలంచెలుగా ఎదిగిన నాయకుడని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఒక చరిత్ర అని కొనియాడారు. ఒక ఆడ, మగ మాట్లాడితే పెడార్థాలు తీస్తారా? అంటూ ఆయన దుమ్మెత్తి పోశారు. పనిగట్టుకుని బురద జల్లడానికి ఇదేమైనా ప్రజా సమస్యనా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు రాయడానికి బదులు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను బయటకు తీసుకురావాలని సూచించారు. చేతిలో కలం ఉందని ఇష్టారీతిన రాతలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అప్పులు చేసి ప్రజలకు సేవ చేసే మమ్మల్ని బద్నాం చేయాలని చూస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలపై జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News