HomeTop StoriesPawan kalyan: తెలంగాణలో జనసేన ఎంట్రీ.. అధినేత ప్రత్యేక ఫోకస్‌.. జూన్ 2న కీలక ప్రకటన..!

Pawan kalyan: తెలంగాణలో జనసేన ఎంట్రీ.. అధినేత ప్రత్యేక ఫోకస్‌.. జూన్ 2న కీలక ప్రకటన..!

Jana Sena entry in Telangana: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ తెలంగాణ పాలిటిక్స్‌పై ఫోకస్‌ పెట్టారు. తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే వచ్చే జూన్ 2 (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) రోజున హైదరాబాద్ వేదికగా తెలంగాణ జనసేన ముఖ్య నాయకులతో పవన్ కల్యాణ్ ఒక కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు భవిష్యత్తులో రాబోయే సార్వత్రిక ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ తెలంగాణలో పొలిటికల్‌ ఎంట్రీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

- Advertisement -

Alao read: Pawan kalyan: తెలంగాణలో జనసేన ఎంట్రీ.. అధినేత ప్రత్యేక ఫోకస్‌.. జూన్ 2న కీలక ప్రకటన..!

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, జన సైనికుల మధ్య మాటల యుద్ధం..

అయితే, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, జన సైనికుల మధ్య జరుగుతున్న వివాదంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం వేడెక్కింది. పవన్ కల్యాణ్‌ను తెలంగాణలో అడుగుపెట్టనివ్వబోమని, ఆయన పర్యటనలను అడ్డుకుంటామని ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్గీయులు హెచ్చరిస్తున్నారు. దీనిపై తెలంగాణ జనసేన నేతలు కూడా అంతే ఘాటుగా స్పందించారు. తమ అధినేతను తెలంగాణకు రాకుండా ఎలా అడ్డుకుంటారో తాము కూడా చూస్తామంటూ జనసైనికులు సవాల్ విసురుతున్నారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తుండటంతో, జూన్ 2న పవన్ కల్యాణ్ హైదరాబాద్ రాకపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అటు, పవన్‌ కల్యాణ్‌ తెలంగాణపై ఫోకస్‌ పెట్టాలని తెలంగాణ జన సైనికుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News