HomeతెలంగాణProf Jayashankar: తెలంగాణ పోలీస్ అకాడమిలో జయశంకర్ జయంతి వేడుకలు

Prof Jayashankar: తెలంగాణ పోలీస్ అకాడమిలో జయశంకర్ జయంతి వేడుకలు

గండిపేట్ (తెలుగు ప్రభ): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సిద్ధాంతపరమైన పునాదులు వేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమిలో గురువారం ఘనంగా నిర్వహించారు. అకాడమిలోని ఏకశిల అడ్మినిస్ట్రేటివ్ భవనంలో ఏర్పాటు చేసిన జయశంకర్ చిత్రపటానికి అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అకాడమీ డిప్యూటీ డైరెక్టర్లు జి. కవిత, ఎన్. వెంకటేశ్వర్లు, కె.ఆర్.కె. ప్రసాద్ మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ అందించిన సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చారిత్రకమని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన జీవితాంతం చేసిన కృషి, ఉద్యమానికి అందించిన మేధోబలం, అంకితభావం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. తెలంగాణ ఉద్యమం ప్రజాస్వామ్యబద్ధంగా విజయవంతం కావడంలో జయశంకర్ చూపిన మార్గదర్శకత్వం కీలకపాత్ర పోషించిందన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు డైరెక్టర్లు వేమా శ్రీనివాసరెడ్డి, యార్లగడ్డ రాంబాబు, నరహరి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి యాదమ్మ, డీఎస్పీలు సతీష్, భాస్కర్, తోట శ్రీనివాసులు, జగదీష్, తిరుపతి, రిటైర్డ్ అదనపు ఎస్పీ సోమశేఖర్‌ మరియు అకాడమీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Also Read: MLA Prakash Goud:మా ప్రాణాలకు ముప్పు.. రక్షణ కల్పించండి.. ఎమ్మెల్యే కుమారుడు సంతోష్ గౌడ్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News