HomeTop StoriesJeevan Reddy: కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన జీవన్‌రెడ్డి.. ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు

Jeevan Reddy: కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన జీవన్‌రెడ్డి.. ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు

Jeevan Reddy Joins BRS: మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ అధినేత కేసీఆర్.. జీవన్‌రెడ్డికి గులాబీ కండువా కప్పి భారత రాష్ట్ర సమితిలోకి ఆహ్వానించారు. జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో తన అనుచరులతో కలిసి జీవన్‌ రెడ్డి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దాదాపు ఏడాది కాలం తర్వాత బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు.  

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-inspects-medigadda-barrage-renovation-works/

తెలంగాణ ప్రయోజనాల కోసమే జీవన్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారని కేసీఆర్‌ అన్నారు. జీవన్‌రెడ్డితో తనకు 40 ఏళ్ల స్నేహం ఉందని.. ఆయన గుండె ధైర్యమున్నోడని ప్రశంసించారు. ఆయన తన ప్రాంతం కోసం ప్రాణం పెట్టి పనిచేశారని కొనియాడారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డికి కేసీఆర్‌ కీలక బాధ్యతలు అప్పగించారు. 

Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-inspects-medigadda-barrage-renovation-works/

జగిత్యాల జిల్లా మాత్రమే కాదు.. పాత కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ బాధ్యతలు కూడా జీవన్‌ రెడ్డి చూడాలని కేసీఆర్‌ కోరారు. ఈ క్షణం నుంచి జీవన్‌ రెడ్డిని బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నానని స్పష్టం చేశారు. భిన్న రాజకీయాల వల్లే వేర్వేరుగా పనిచేశామని.. ఉమ్మడి కరీంనగర్‌తో పాటు పక్క జిల్లాల్లో కూడా జీవన్‌రెడ్డికి అభిమానులు ఉన్నారని కేసీఆర్‌ అన్నారు. జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. వెంటనే ప్రజలు ఎమ్మెల్సీగా గెలిపించారని పేర్కొన్నారు. ఆయనకు పదవులు కొత్త కాదని.. ఒక కుటుంబంలో అన్నదమ్ముల్లా పనిచేద్దామని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News