- దిగువకు భారీగా వరద ప్రవాహం
- శ్రీశైలంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
నాగర్ కర్నూల్ (తెలుగు ప్రభ): కృష్ణానది పరివాహక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలో కష్టపరివాక ప్రాంతంలో వరద ప్రవాహం నెమ్మదిగా కొనసాగుతున్నది. తెలుగు రాష్ట్రాలలోని జూరాల, శ్రీశైలం జలాశయాలు సంబంధించిన వరద ప్రవాహం వివరాలు మంగళవారం సాయంత్రం సంబంధిత శాఖల అధికారులు ప్రకటించిన ప్రకారం. జూరాల ప్రాజెక్టుకు 50,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతుండగా ఈ ప్రాజెక్ట్ 8 గేట్లను తెరిచి దిగువకు 32,312 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ ఎగువ దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ 40,537 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 318.516 మీటర్లకు గాను, 317.89 మీటర్లుగా, నీటి సామర్థ్యం 9.657 టిఎంసిలకు గాను 8.396 టీఎంసీలుగా ఉంది. అదేవిధంగా నీలం సంజీవరెడ్డి శ్రీశైలం జలాశయానికి 72,849 క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఈ ప్రాజెక్టు నుంచి మంగళవారం ఉదయం హెచ్ఎన్ఎస్ఎస్ 3050, ఎంజికేఎల్ఐకి 2400 క్యూసెక్కుల నీరు ఎత్తిపోస్తుండగా పోతిరెడ్డిపాడు ద్వారా 8000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ వైపున ఉన్న కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 4,013 మిలియన్ యూనిట్లు, తెలంగాణ వైపున ఉన్న ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 10,052 మిలియన్ యూనిట్లు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు మంగళవారం సాయంత్రం 6 గంటలకు 885 అడుగులకు గాను 878.80 అడుగులుగా, నీటి సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను 181.8320 టీఎంసీలుగా ఉన్నది.
Also read: Ganja Seizure: ఖమ్మంలో భారీగా గంజాయి పట్టివేత.. 15.7 కేజీల గంజాయి స్వాధీనం

