Saraswati Antya Pushkaralu: గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల త్రివేణీ సంగమ క్షేత్రమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మరోమారు భక్తి పారవశ్యంతో ముంచెత్తడానికి సిద్ధమైంది. అపురూపమైన ‘సరస్వతీ అంత్య పుష్కరాల’ వేడుకలకు వేదికైంది. మే 21 నుంచి జూన్ 1 వరకు సాగే ఈ మహాక్రతువులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు సుమారు 30 నుంచి 40 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా.
పుష్కర ప్రణాళిక – క్షేత్రస్థాయి పరిశీలన
భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీజీఆర్టీసీ (TGRTC) పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. వరంగల్ రీజనల్ మేనేజర్ భవానీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 3,360 ప్రత్యేక బస్సుల ద్వారా 5,772 ట్రిప్పులను నడుపుతున్నారు.
Also Read: https://teluguprabha.net/top-stories/kamareddy-farmers-protest-due-to-delay-in-paddy-procurement/
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, పరకాల, భూపాలపల్లి, మహబూబాబాద్ వంటి ప్రధాన డిపోల నుండి కాళేశ్వరానికి ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. పుష్కరాల ప్రత్యేక బస్సులకు సాధారణ ఛార్జీల కంటే 50 శాతం అదనపు వసూలు చేస్తారు. అయితే, మహాలక్ష్మి పథకం వర్తించే మహిళలకు యథావిధిగా ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని ఆర్టీసీ స్పష్టం చేసింది.
ఆధ్యాత్మిక శోభ.. ఘనంగా ప్రారంభోత్సవం : మే 21న ఉదయం 5.43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి పుణ్యస్నానంతో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ప్రముఖ పీఠాధిపతుల రాక, ఉదయం హోమాలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు పండుగ వాతావరణాన్ని తలపిస్తాయి.
Also Read: https://teluguprabha.net/top-stories/acb-raids-jalmandal-gm-house-updates/
వైద్యం – భద్రత: భక్తులే ప్రాధాన్యత : లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ వేడుకలో ఆరోగ్య భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
16 వైద్య శిబిరాలు: ప్రధాన ఘాట్, పీహెచ్‌సీలు, పార్కింగ్ ఏరియాలు మరియు బస్టాండ్ల వద్ద ఏర్పాటు చేశారు.
నిపుణుల బృందం: 576 మంది సుశిక్షితులైన సిబ్బంది, 18 మంది ప్రత్యేక వైద్యులు 24/7 అందుబాటులో ఉంటారు. మందుల నిల్వ కోసం ప్రత్యేక స్టోరేజ్ గదులు, అత్యవసర చికిత్సకు అవసరమైన సౌకర్యాలను వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేసింది.

