HomeతెలంగాణKamareddy: కామారెడ్డి మెడికల్ కాలేజీలో 57 ఉద్యోగాలు

Kamareddy: కామారెడ్డి మెడికల్ కాలేజీలో 57 ఉద్యోగాలు

కామారెడ్డి, అక్టోబర్ 15 (తెలుగు ప్రభ): కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 57 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

పోస్టుల వివరాలు

ప్రొఫెసర్ పోస్టులు 5, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 14, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 20, సీనియర్ రెసిడెంట్ పోస్టులు 18 భర్తీ చేయనున్నారు. మొత్తం 57 పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు.

అక్టోబర్ 28న ఇంటర్వ్యూలు

ఈ నెల 28వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు. కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు.

అసలు ధ్రువపత్రాలతో హాజరుకావాలి

సంబంధిత పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతలు, ఇతర వివరాలకు సంబంధించిన అసలు ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. నియామకాలకు సంబంధించిన అర్హతలు, ఇతర నిబంధనలు, పూర్తి వివరాల కోసం కళాశాల అధికారిక వెబ్‌సైట్ www.gmckamareddy.org ను సందర్శించాలని తెలిపారు.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News