Kanchipuram Narayani Silks newest showroom in Gachibowli: పెళ్లి పట్టుచీరెలకు, సంప్రదాయ చేనేత వస్త్రాలకు పేరొందిన కాంచీపురం నారాయణి సిల్క్స్ మరో కొత్త షోరూమ్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రారంభమైంది. సంస్థ డైరెక్టర్లు, ప్రముఖుల సమక్షంలో ఈ ప్రారంభ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. గచ్చిబౌలి మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ నూతన షోరూమ్‌లో పండగ వస్త్రాలు, నూతన వధువును సింగారించే పట్టుచీరెలు వైవిధ్యమైన కలెక్షన్లు అలరించనున్నాయి. దార్శనికులైన శ్రీ పి.వెంకటేశ్వర్లు, శ్రీ ఎస్.రాజమౌళి, శ్రీ టి.ప్రసాదరావు, దివంగత పి.సత్యనారాయణ గార్లు నెలకొల్పిన కాంచీపురం నారాయణి సిల్క్స్ తెలుగు సంప్రదాయాన్ని, ఆధునిక జీవనశైలిని మేళవించిన ఒక సుప్రసిద్ధ బ్రాండ్‌గా కొనసాగుతోందని, వైవిధ్యంలో, నాణ్యతలో, విశ్వసనీయతలో, అందుబాటు ధరల్లో కుటుంబంలోని అన్నితరాల వారినీ ఆకర్షిస్తూ, అలరిస్తోందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
అధిరిపోయే కలెక్షన్స్.. ప్రారంభ ఆఫర్లు..
గచ్చిబౌలిలో మా కొత్త షోరూమ్‌ను ప్రారంభించుకోవడం ఎంతో ఆనందాన్నీ, సంతృప్తిని కలిగించిందని కాంచీపురం నారాయణి సిల్క్స్ సంస్థ డైరెక్టర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ & హోల్ టైం-డైరెక్టర్ శ్రీ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, “హైదరాబాద్, గచ్చిబౌలిలో తమ షోరూమ్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. సంప్రదాయాలు ఉట్టిపడేలా సరికొత్త ఫ్యాషన్స్‌ను పరిచయం చేస్తున్నాం. అద్భుతమైన కాంచీపురం పట్టు వెరైటీలు గచ్చిబౌలి పరిసర ప్రాంత కస్టమర్లను ఖచ్చితంగా అలరిస్తాయని ఆశిస్తున్నాం.” అని పేర్కొన్నారు. ఇక, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సీర్ణ రాజమౌళి మాట్లాడుతూ, “సంప్రదాయాన్ని సరికొత్త ఫ్యాషన్స్‌తో మేళవించడమే మా ఆశయం. అత్యంత ప్రత్యేకమైన పట్టు చేనేత వస్త్రాలను ప్రారంభోత్సవ ఆఫర్లుగా ఇక్కడి వస్త్ర ప్రియులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. తెలుగు సంప్రదాయాన్ని, ఆధునిక కాలానికి అనుగుణంగా తీర్చిదిద్దడంలో మా కాంచీపురం నారాయణి సిల్క్స్ ఎప్పుడూ ముందుంటుంది.” అని పేర్కొన్నారు. సంస్థ హోల్ టైం డైరెక్టర్ శ్రీ తిరువీధుల ప్రసాదరావు మాట్లాడుతూ.. “కాంచీపురం నారాయణి సిల్క్స్ అత్యుత్తమ నాణ్యతకు, వారసత్వ సంపదకు, హుందాకు ప్రతీక. వివాహాది శుభకార్యాల్లో నూతన వధువులో లక్ష్మీకళ ఉట్టిపడేలా అలంకరించే కాంచీపురం పట్టు చీరెలు వస్త్రప్రియులను తప్పకుండా కనువిందు చేస్తాయి.” అని తెలిపారు. కాగా, నూతన షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా అందిస్తున్న ఆఫర్లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలరి కాంచీపురం నారాయణి సిల్క్స్ షోరూమ్ యాజమాన్యం ప్రకటించింది.

