ఎల్లారెడ్డిపేట(తెలుగు ప్రభ): తెలంగాణ సాంస్కృతికి సాంప్రదాయానికి నిలువుటద్దంగా ఉన్న మహిళల బతుకమ్మ వేడుకలు మస్కట్ లోని మినిస్ట్రీ ఆఫ్ సివిల్ క్లబ్ (గాలా) లో పెద్ద ఎత్తున బతుకమ్మలు పెట్టి మహిళలు ఆడి పాడారు.ఇందుకు తగిన ఏర్పాట్లను వతెలంగాణకు సంబంధించిన ఓమన్ ఎన్నారై సెల్ నాయకులు అన్ని వసతులు సమకూర్చారు. సుమారు నాలుగు గంటల పాటు మహిళలు బతుకమ్మలు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ క్లబ్లో పెట్టి ఆడినట్లు ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన పలువురు తెలుగు ప్రభకు తెలిపారు. తాము ఉపాధి నిమిత్తం మస్కట్ దేశానికి వచ్చిన కానీ ఇక్కడ బతుకమ్మ వేడుకలను చూస్తే మా స్వగ్రామంలో ఉన్నట్టుగా అనిపించిందని వివరించారు. ఇందులో సుమారు 200 మంది తెలంగాణకు చెందిన మహిళలు బతుకమ్మ ఆటలు ఆడారు. అనంతరం వీటిని నిమజ్జనం చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు

