Thursday, March 12, 2026
Homeతెలంగాణకరీంనగర్BJP: కరీంనగర్‌ మేయర్‌ అభ్యర్థి ఖరారు.. ప్రకటించిన బీజేపీ!

BJP: కరీంనగర్‌ మేయర్‌ అభ్యర్థి ఖరారు.. ప్రకటించిన బీజేపీ!

Karimnagar Mayor: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నికల ప్రక్రియ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటల నుంచి ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతుండగా.. మధ్యాహ్నం 12:30 గంటలకు పరోక్ష పద్ధతిలో ఎన్నిక జరగనుంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తూ బీ-ఫామ్‌లు అందజేస్తున్నాయి.

- Advertisement -

కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థులు ఖరారు: అత్యంత ఉత్కంఠ రేపుతున్న కరీంనగర్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్‌ను, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా సునీల్ రావును ప్రకటించింది. అంతేకాకుండా ఈ పేర్లను బీజేపీ ఎన్నికల అధికారికి సైతం ప్రతిపాదించింది. బీజేపీ సంఖ్యా బలం అనుకూలంగా ఉండటంతో వీరిద్దరి ఎంపిక దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

ఎన్నికల షెడ్యూల్ ఇలా:

  • ఉదయం 11:00 గంటలకు: సభ్యులందరితో ప్రత్యేక అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం.
  • మధ్యాహ్నం 12:30 గంటలకు: మేయర్, ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం.
  • మధ్యాహ్నం 1:30 గంటల కల్లా: ఫలితాల వెల్లడి మరియు విజేతల ప్రమాణ స్వీకారం. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విప్ ఉల్లంఘనలు జరగకుండా పార్టీలు తమ సభ్యులకు కఠిన ఆదేశాలు జారీ చేశాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News