ధర్మపురి,(తెలుగు ప్రభ): మాజీ మంత్రి, దివంగత జువ్వాడి రత్నాకర్ రావు 99వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.రత్నాకర్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
రత్నాకర్ రావు మంచితనానికి మారుపేరుగా, కల్మషం లేని మనసుతో ప్రజలకు సేవలందించారని ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి గుర్తుచేశారు. ప్రజాప్రతినిధిగా, రాజకీయ నాయకుడిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనబట్ల దినేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

