Rabies in Vempet: జగిత్యాల జిల్లా వేంపేటలో రేబిస్ భయం మొదలైంది. ఇటీవల కుక్క కాటుతో గేదె మృతి చెందడంతో గ్రామస్థుల్లో భయాందోళన నెలకొంది. గేదె పాలు తాగామనే అనుమానంతో పలువురు.. వ్యాక్సిన్ వేయించుకునేందుకు పీహెచ్‌సీకి క్యూ కట్టారు.
Also Read: https://teluguprabha.net/telangana/khammam-news/ktr-visits-house-demolition-victims-in-velugumatla/
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వేంపేట గ్రామంలో రేబిస్ వ్యాధి కలకలం రేపుతోంది. ఆ గ్రామంలో కుక్క కాటు కారణంగా రేబిస్ సోకి ఓ గేదె మృతి చెందగా.. ఆ రోజు నుంచి గ్రామస్థులు కంటి మీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇందుకు కారణం ఆ గేదె చనిపోవడానికి ముందు, దాని పాలను సుమారు 30 మంది గ్రామస్తులు తాగినట్లు సమాచారం. ఈ క్రమంలో పాలు తాగిన వారందరూ భయాందోళనకు గురై, ముందు జాగ్రత్తగా యాంటీ రేబీస్ టీకాలు వేయించుకుంటున్నారు. దీంతో పీహెచ్‌సీ వద్ద బారులు తీరారు. భయాందోళనలతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే ఈ పుకార్లను నమ్మవద్దని స్థానిక వైద్యులు హెచ్చరిస్తున్నారు. రేబిస్ సోకిన గేదె పాలు తాగితే వ్యాధి రాదని స్పష్టం చేశారు. సాధారణంగా ఈ జంతువుల పాలను బాగా మరిగించి తాగడం వల్ల అందులోని వైరస్ నశించి.. రేబీస్ వ్యాపించే అవకాశం తక్కువగా ఉందని చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా టీకా తీసుకోవడం సురక్షితమని సూచిస్తున్నారు.
కాగా, ఇటీవల ఓ మహారాష్ట్రలో కుక్కకాటుకి గురైన ఓ 30 ఏళ్ల బ్యాంకు ఉద్యోగి.. వ్యాక్సిన్ వేయించుకున్నాడు. అయితే ఒకటే డోసు వేయించుకోవడంతో రేబిస్ వస్తుందేమోననే భయంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

