- రూ.12 వేల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలి
- విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే ఊరుకోం.. గల్లీ నుంచి అసెంబ్లీ వరకు పోరాటం కొనసాగిస్తాం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు
కరీంనగర్ (తెలుగు ప్రభ): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన “ఫీజుల బకాయి–బీజేపీ లడాయి” కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో దాదాపు రూ.12 వేల కోట్ల మేర ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని రామచంద్రరావు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని, కాలేజీలకు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యాసంస్థలు కూడా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం గల్లీ నుంచి అసెంబ్లీ వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని రామచంద్రరావు స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పూర్తిగా విడుదల చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండె గణేష్, జిల్లా ఇన్‌చార్జ్ శాంత కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, మాజీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సంఘ నరేష్, మాజీ ఎమ్మెల్యే శోభక్క, డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, కార్పొరేటర్లు, విద్యార్థులు, బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.

