Karimnagar Robbery Case: కరీంనగర్‌లోని బంగారు నగల దుకాణంలో ఆదివారం ఉదయం భారీ దోపిడీ, కాల్పుల ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జ్యోతి నగర్‌లోని పీఎంజే జ్యువెలర్స్ షాపులో జరిగిన ఈ ఘటనపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఐదుగురు దుండగులు ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సీసీ కెమెరాలో రికార్డైన వీడియోల ఆధారంగా నిందితుల ఫోటోలు విడుదల చేశారు. హర్యానాకు చెందిన దోపిడీదొంగలుగా గుర్తించిన పోలీసులు.. నిందితుల ఆచూకీ తెలిపినవారికి రూ. లక్ష బహుమతి ప్రకటించారు.
Also Read: https://teluguprabha.net/telangana/thieves-gun-fire-at-pmj-jewellery-store-in-karimnagar/
నిందితులు కస్టమర్ల వేషంలో లోపలికి వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆధ్వర్యంలో 12 ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దింపారు. ఘటనా స్థలంలోనూ, సమీపంలోని డ్రైనేజీలోనూ నిందితులు వాడిన తుపాకీలు, బుల్లెట్లు, కట్టర్, ప్లాస్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని బుల్లెట్లు జ్యువెలరీ షాప్‌లో లభ్యమయ్యాయి.
Panic gripped in #Karimnagar town after #Armed #Robbers opened fire inside the PMJ Jewellery [#PMJjewels] showroom and fled on bikes with gold ornaments, leaving 3 staff members injured, caught in many #CCTv .
The incident has raised serious concerns… pic.twitter.com/u6rRtymNf1
— Surya Reddy (@jsuryareddy) May 3, 2026
Also Read: https://teluguprabha.net/national-news/tvk-chief-vijay-books-a-resort-in-mahabalipuram/
ఘటన అనంతరం నిందితులు రెండు బైకులపై పారిపోయినట్లు గుర్తించారు. షోరూమ్, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. దుండగులు ఒక కిలో వరకు బంగారం చోరీ చేసినట్లు సమాచారం. కాల్పుల్లో నలుగురు సిబ్బంది గాయపడగా, వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

