Jagtial Municipal Chairperson: జగిత్యాల కాంగ్రెస్‌లో విభేదాలు మళ్లీ తారాస్థాయికి చేరే అవకాశం ఉంది. నేడు మున్సిపల్ చైర్‌పర్సన్‌ను ఎన్నుకోవాల్సి ఉండగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య వర్గపోరు కట్టలు తెంచుకునేలా కనిపిస్తుంది.
చైర్‌పర్సన్ అభ్యర్థిగా వాణి పేరు ఖరారు!: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) ప్రతిపాదనలను కాదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) వర్గానికి మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా వాణి పేరును పార్టీ దాదాపు ఖరారు చేసింది. వాణి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రధాన అనుచరురాలు కావడంతో జీవన్ రెడ్డి వర్గానికి మింగుడు పడటంలేదు.
Also read-Karimnagar: కరీంనగర్ మేయర్ పీఠంపై ఉత్కంఠకు తెర.. బీఆర్ఎస్ అనూహ్య నిర్ణయంతో బీజేపీకి లైన్ క్లియర్!
ప్రశ్నిస్తున్న పాత కాంగ్రెస్ నేతలు: గత కొంతకాలంగా మున్సిపల్ పీఠంపై తన పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్న జీవన్ రెడ్డికి అధిష్టాన నిర్ణయం కొరకరాని కొయ్యలా మారింది. శాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వ్యక్తులను కాదని కొత్తగా వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడమేంటని పాత కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అధిష్టానం నిర్ణయంతో జగిత్యాల కాంగ్రెస్‌లో ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ వర్గపోరు పార్టీని బలోపేతం చేస్తుందా లేక పతనానికి దారితీస్తుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.

