Homeతెలంగాణకరీంనగర్Ukraine war: ఉక్రెయిన్‌ యుద్ధంలో జగిత్యాల వాసి సుదర్శన్‌గౌడ్‌ మృతి

Ukraine war: ఉక్రెయిన్‌ యుద్ధంలో జగిత్యాల వాసి సుదర్శన్‌గౌడ్‌ మృతి

జగిత్యాల(తెలుగుప్రభ): యుద్ధంతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్‌లో జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి క్షిపణి దాడిలో మృతి చెందారు. హస్నాబాద్‌ గ్రామానికి చెందిన వి. సుదర్శన్‌గౌడ్‌ (42) ఆగస్టు 31న స్థానిక కాలమానం ప్రకారం రాత్రి జరిగిన క్షిపణి దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉపాధి కోసం మూడు నెలల క్రితం ఉక్రెయిన్‌ వెళ్లిన సుదర్శన్‌గౌడ్‌ అక్కడ ఓ నిర్మాణ సంస్థలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఉక్రెయిన్‌లోని ఓ ట్రావెల్‌ ఏజెంట్‌ హస్నాబాద్‌ సర్పంచ్‌కు ఈ విషాద సమాచారాన్ని అందించినట్లు ఆయన బంధువు వెంకటరాజం తెలిపారు. సుదర్శన్‌గౌడ్‌ భార్య, పిల్లలు స్వగ్రామంలోనే ఉంటున్నారు. ఆయన మృతదేహం మరో రెండు వారాల్లో స్వగ్రామానికి చేరే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ హస్నాబాద్‌లోని సుదర్శన్‌గౌడ్‌ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News