Love Marriage issue: దశాబ్దానికి పైగా ప్రేమించాడు. నువ్వు లేనిదే నేనులేనని అన్నాడు. పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో ఆ యువతి నమ్మింది. కానీ సీన్ కట్ చేస్తే.. ఆ యువకుడు వేరే అమ్మయిని పెళ్లిచేసుకునేందుకు సిద్ధమయ్యాడు. పెళ్లిపీటలు సైతం ఎక్కాడు. ఈ విషయంకాస్తా.. ప్రియురాలుకు తెలిసింది. దీంతో ప్రియురాలు ప్రియుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సరిగ్గా తాళికట్టే సమయానికి పెళ్లి మండపానికి చేరుకుని.. యువకుడి నిజస్వరూపాన్ని బయటపెట్టింది. దీంతో పెళ్లికూతురు కుటుంబ సభ్యులు వివాహాన్ని రద్దు చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒకరిని ప్రేమించి మరొకరితో పెళ్లి: ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. చొప్పదండి మండలం చిట్యాలపల్లి గ్రామానికి చెందిన నరేశ్ చొప్పదండి పోలీసు స్టేషన్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇదే క్రమంలో హన్మకొండకు చెందిన యువతితో నరేశ్‌కు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఆ యువకుడు.. ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. దీంతో ఆ యువతి నరేశ్‌తో మరింతగా దగ్గరయ్యింది. కానీ ఆ యువకుడు ప్రియురాలుకు ఇచ్చిన మాట తప్పాడు. వేరే అమ్మాయితో పెళ్లి పీటలెక్కారు. ఈ విషయం ప్రియురాలికి తెలిసింది. దీంతో ఆ యువతి మహిళ సంఘాల నేతలతో కలిసి పంక్షన్‌హాల్‌కి వెళ్లింది. తన దగ్గర ఉన్న ఫోటోలు చూపించి వివాహం నిలిపివెయ్యాలని కోరింది.
Also read-Telangana: లండన్‌లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ.. కౌన్సిలర్‌గా విజయం
పోలీసు స్టేషనులో ఫిర్యాదు: ప్రియురాలు పెళ్లి మండపం దగ్గరికి రావడంతో.. వరుడి కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. వెంటనే ఆ యువతిని అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ అమ్మాయి మాత్రం అక్కడి నుండి అస్సలు వెళ్లలేదు. దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహారం కాస్తా పెళ్లికూతురు కుటుంబానికి తెలిసింది. దీంతో వెంటనే వారు పెళ్లిని రద్దు చేశారు. అనంతరం నరేశ్‌పై చొప్పదండి పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు.

