HomeTop StoriesControversy : నువ్వో 'బోడి టీచర్'... ఎమ్మెల్యే కవ్వంపల్లి వివాదాస్పద వ్యాఖ్యలు

Controversy : నువ్వో ‘బోడి టీచర్’… ఎమ్మెల్యే కవ్వంపల్లి వివాదాస్పద వ్యాఖ్యలు

తిమ్మాపూర్  (తెలుగు ప్రభ): అసలే ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం అందులో అందరికీ విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులందరూ సంతోషంగా జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం సాక్షిగా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మరోసారి ఉపాధ్యాయుల వృత్తిని కించపరిచే విధంగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ లోని అరుంధతి కళ్యాణ మండపంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడారు. ఇటీవల ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తో పాటు షాడో ఎమ్మెల్యే ల పట్ల దుమ్మెత్తి పోస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను విమర్శిస్తూ ఆఫ్ట్రాల్ బోడి టీచర్ రసమయి బాలకిషన్ అంటూ వివాస్పద వాఖ్యలు చేశారు.

నువ్వు ఎమ్మెల్యే కాకముందు గోసి గొంగడి తో వచ్చావని, బోడి టీచరు ఉద్యోగం చేశావని.. ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని వేల ఆస్తులు ఎలా వచ్చాయని విమర్శించారు. ఆయన చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉపాధ్యాయ వర్గాల నుండి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉపాధ్యాయ దినోత్సవం రోజున వేరే వారిని విమర్శించబడి ఉపాధ్యాయ వృత్తిని విమర్శించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఇటీవల ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నిలదీస్తున్నడంతో ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని, డాక్టర్ అయ్యుండి మరో డాక్టర్కు చూపించుకోవాలని పలువురు చర్చించుకోవడం  చర్చానీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News