Homeతెలంగాణకరీంనగర్Sircilla: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి.. బక్రీద్ పండుగ వేళ ముస్లిం సంఘాల డిమాండ్

Sircilla: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి.. బక్రీద్ పండుగ వేళ ముస్లిం సంఘాల డిమాండ్

Sircilla: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. బక్రీద్ పండుగను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముస్లిం సంఘాల నాయకులు కీలక డిమాండ్‌ను లేవనెత్తారు. బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న ఇంథిజామి మసీద్ కమిటీ సభ్యులతో పాటు ముస్లిం పెద్దలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ మద్దతును ప్రకటించారు.

- Advertisement -

సమాజంలో అలజడి సృష్టించే ప్రయత్నం: ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో కొన్ని రాజకీయ, మతతత్వ శక్తులు పశువుల అంశాన్ని వాడుకుంటూ కావాలనే సమాజంలో అలజడి సృష్టిస్తున్నాయని ఆరోపించారు. రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని వారు కోరారు.

Also read-Bakrid: బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు!

ముస్లిం లీడర్ల ప్రధాన వాదనలు: రాజకీయ లబ్ధికి చెక్: ఆవును జాతీయ జంతువుగా గుర్తిస్తే, ఏ రాజకీయ పార్టీ లేదా మతతత్వ శక్తి దీనిని ఒక అస్త్రంగా వాడుకునే అవకాశం ఉండదని అన్నారు. జాతీయ జంతువుగా ప్రకటిస్తే.. ఆవును కొనడం, అమ్మడం లేదా హింసించడం నేరమనే విషయం అందరికీ స్పష్టంగా తెలుస్తుందని ముస్లీం పెద్దలు అన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలుచోట్ల ఈ తరహా డిమాండ్లు వినిపిస్తుండగా.. తాజాగా సిరిసిల్ల ముస్లిం సమాజం సైతం దీనికి మద్దతు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News