Homeతెలంగాణకరీంనగర్Yellareddypet: మీసేవ కేంద్రాల్లో నిర్ణీత రుసుములే చెల్లించాలి.. ఈడీఎం శ్రీనివాస్

Yellareddypet: మీసేవ కేంద్రాల్లో నిర్ణీత రుసుములే చెల్లించాలి.. ఈడీఎం శ్రీనివాస్

ఎల్లారెడ్డిపేట (తెలుగు ప్రభ): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మీసేవా కేంద్రాలలో ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్టిక ప్రకారమే ప్రజలు సేవా రుసుములు చెల్లించి తప్పనిసరిగా రశీదు పొందాలని జిల్లా మీసేవ సెంటర్ల ఈడిఎం  శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆదివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ‘విశ్వం మీసేవ’ కేంద్రాన్ని జిల్లా మేనేజర్ మహేష్‌తో కలిసి ఈడిఎం శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వం మీసేవ కేంద్రంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనపై వేగంగా స్పందించి పాత ఆపరేటర్‌ను విధుల్లోంచి తొలగించామని తెలిపారు. ఆయన స్థానంలో కొత్త ఆపరేటర్‌ను నియమించి, యజమాని మల్లేశంతో పాటు కొత్త ఆపరేటర్‌కు లాగిన్ ఐడీలు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని తెలిపారు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.

- Advertisement -

అదనపు వసూళ్లపై ఫిర్యాదు చేయండి..
జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 92 మీసేవ కేంద్రాలు సేవలు అందిస్తున్నాయని శ్రీనివాస్ తెలిపారు. మీసేవ నిర్వాహకులు ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రజల వద్ద అదనపు చార్జీలు వసూలు చేస్తే ఆధారాలతో తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అటువంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చిన్నారుల ఆధార్ సేవలు పూర్తిగా ఉచితం..
చిన్న పిల్లల ఆధార్ కార్డు నమోదు, సవరణల విషయంలో మీసేవ నిర్వాహకులకు ఎలాంటి రుసుములు (చార్జీలు) చెల్లించాల్సిన అవసరం లేదని ఈడిఎం స్పష్టం చేశారు. అలాగే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఖాళీగా ఉన్న మీసేవ కేంద్రాల భర్తీ ప్రక్రియను స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తూ, పారదర్శకంగా ఇంటర్వ్యూల ద్వారా చేపడుతున్నట్లు శ్రీనివాస్ వివరించారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News