Homeతెలంగాణకరీంనగర్Complex Traders: కాంప్లెక్స్ వ్యాపారుల సమస్యకు పరిష్కారం.. కలెక్టర్‌కు పాలాభిషేకం

Complex Traders: కాంప్లెక్స్ వ్యాపారుల సమస్యకు పరిష్కారం.. కలెక్టర్‌కు పాలాభిషేకం

కలెక్టర్ చోరువతో… ఏళ్ళ తరబడి ఉన్న సమస్య పరిష్కారం

- Advertisement -

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యపై ప్రత్యేక చొరవ

షట్టర్ల రిజిస్ట్రేషన్‌కు చర్యలు.. కలెక్టర్‌ కోయ శ్రీహర్షకు వ్యాపారుల కృతజ్ఞతలు

పెద్దపల్లి, (తెలుగు ప్రభ):ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న జూనియర్‌ కళాశాల కాంప్లెక్స్‌ వ్యాపారుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకున్న జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్షకు వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు. కాంప్లెక్స్‌లోని షట్టర్లను కిరాయికి తీసుకుని ఎన్నో ఏళ్లుగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం కలెక్టర్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా బిజెపి ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం మాట్లాడుతూ.. జూనియర్‌ కళాశాల కాంప్లెక్స్‌లోని షట్టర్ల సమస్యపై కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. షాపుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవడంతో దీర్ఘకాలంగా సమస్యను ఎదుర్కొంటున్న వ్యాపారులకు భరోసా కలిగిందన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ కలెక్టర్‌ స్పందించిన తీరు అభినందనీయమని పేర్కొన్నారు.

సమస్య పరిష్కారంలో మీడియా పాత్ర అభినందనీయం

షాపర్ల సమస్యను ప్రజల దృష్టికి తీసుకురావడంతో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో సహకరించిన పత్రికా మిత్రులకు పల్లె సదానందం కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కారానికి వారధిగా నిలుస్తున్న మీడియా ప్రతినిధుల సేవలను అభినందించారు.

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవడం ద్వారా తమకు భరోసా కల్పించిన కలెక్టర్‌ కోయ శ్రీహర్షకు షాపర్ల తరఫున మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ఇదే విధమైన స్పందనతో ముందుకు సాగాలని కోరారు.ఈ కార్యక్రమంలో జూనియర్‌ కళాశాల కాంప్లెక్స్‌ వ్యాపారుల ప్రతినిధులు మోర మనోహర్‌, బండ కరుణాకర్‌, పెండ్యాల కుమార్‌, తాళ్ల లక్ష్మణ్‌, శానగొండ సంపత్‌కుమార్‌, వెంకటేష్‌, కొండ్రా మనోహర్‌, అబిలాష్‌, ఫరూక్‌తో పాటు పలువురు షాపు యజమానులు, స్థానికులు, పాల్గొన్నారు.

Also Read:Kinnerasani Bridge: ప్రమాదకరంగా మారిన కిన్నెరసాని బ్రిడ్జి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News