పెద్దపల్లి, (తెలుగు ప్రభ): పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంప్లెక్స్‌లో స్వయంగా దుకాణాలు నిర్వహిస్తున్న 26 మంది దుకాణదారులు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావును మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. తమ దుకాణాలకు సొంత పేర్లపై అగ్రిమెంట్లు చేయించేందుకు చొరవ చూపినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
శివపల్లిలో ఎమ్మెల్యే విజయరమణ రావును కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం చూపి, దుకాణాలను నిర్వహిస్తున్న వారికి వారి సొంత పేర్లపై అగ్రిమెంట్లు చేయించడంలో సహకరించినందుకు దుకాణదారులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు భూతగడ్డ సంపత్‌తో పాటు దుకాణదారులు అభిలాష్, ఫారుక్, విష్ణు, ఆంజనేయులు, సుభాన్, ఓదెలు, వికాస్, రాజు, శేఖర్, కుమార్, ఉమేష్, సురేష్, చంద్రమౌళి, రషీద్ తదితరులు పాల్గొన్నారు.

