Homeతెలంగాణకరీంనగర్Ramagundam: నైపుణ్యంతో కొలువుల బాట!

Ramagundam: నైపుణ్యంతో కొలువుల బాట!

  • సింగరేణి ఆర్జీ1నైపుణ్య శిక్షణ కేంద్రం నుంచి 112 మంది ఉద్యోగాలకు ఎంపిక
  • ఫాక్స్కాన్లో 87 మంది మహిళల కు అవకాశం
  • తొలి విడతలో బయలుదేరిన 55 మంది మహిళలు

రామగుండం (తెలుగు ప్రభ): సింగరేణి ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలనిస్తోంది. రామగుండం-1ఏరియాలోని సింగరేణి జీవీటీసీ నైపుణ్యాభి వృద్ధి కేంద్రం ద్వారా తాజాగా 154 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు.127 మంది మహిళా అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా వీరిలో 87 మంది హైదరాబాద్ లోని ఫాక్స్కాన్ కంపెనీలో ఉద్యోగాలకు ఎంపిక కాగా, మరో 27 మంది పురుష అభ్యర్థులు సోలార్ టెక్నిషియన్ ఇంటర్వ్యూలకు హాజరు కాగా వీరిలో 25 మంది సోలార్ టెక్నిషియన్లుగా ఉద్యోగాల్లో చేరనున్నారు. ఫాక్స్కాన్కు ఎంపికైన మహిళ ల్లో తొలి విడతగా 55 మంది ఆదివారం గోదావరిఖని నుంచి హైదరాబాద్కుబయలుదేరారు.

- Advertisement -

శిక్షణ నుంచి ఉపాధి వరకు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఈ కేంద్రం స్థానిక యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది.గత రెండేళ్లలో 500 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించింది. మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటోంది.

తయారీ రంగంలో మహిళలకు అవకాశం

మహిళలకు తయారీ రంగంలో అవకాశాలుఫాక్స్కాన్ కంపెనీ ఆధ్వర్యంలో గత వారం జీవీటీసీ నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో మహిళాఅభ్యర్థులకు ప్రత్యేక ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహించారు.హైదరాబాద్లోని కంపెనీ తయారీ కేంద్రంలో ఆపిల్ ఇయర్పాడ్స్,ఎలక్ట్రానిక్ విడిభాగాల అసెంబ్లింగ్ విభాగాల్లో పనిచేసేందుకు 87 మంది మహిళలను ఎంపిక చేశారు.స్థానిక మహిళలకు పారిశ్రామిక రంగంలో లభించిన ఈ అవకాశాలు వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడను న్నాయి.సోలార్ టెక్నిషియన్ కోర్సులో శిక్షణ పొందిన 25 మంది ఉద్యోగాలకు ఎంపికై నట్లు ఆర్జీ-1 జీఎం డి.లలిత్ కుమార్ తెలిపారు.వీరు పది రోజుల్లో ఎల్ అండ్ ఎన్ కంపెనీలో ఉద్యోగాల్లో చేరనున్నట్లు పేర్కొన్నారు.

నైపుణ్యాలతో భవిష్యత్తుకు పునాది

సింగరేణి ప్రభావిత ప్రాంతాల యువతకు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు సంస్థ కృషి చేస్తోందని జీఎం డి.లలిత్ కుమార్ అన్నారు.శిక్షణను ఉద్యోగ అవకాశాలతో అనుసంధానించడం ద్వారా యువత మెరుగైన భవిష్యత్తు ను నిర్మించుకునే అవకాశం లభిస్తోందని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, క్రమశిక్షణతో పనిచేస్తూ వృత్తిలో ఎదగాలని సూచించారు.కార్యక్రమంలో ఎస్వో టు జీఎం ఎస్.కె. చంద్రశేఖర్,ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య,టాస్క్ మేనేజర్ డాక్టర్ కౌసల్య, ఎల్ అండ్ ఎన్ డైరెక్టర్ కౌశల్,ఫాక్స్కాన్ హెచ్ఆర్ ప్రతినిధి ఆర్. శ్రీనివాస్,జీవీటీసీమేనేజర్ మాధవరెడ్డి,సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్,ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News