Homeతెలంగాణకరీంనగర్Ramagundam: రామగుండం కార్పొరేషన్ లో బతుకమ్మ చీరల పంపిణీ లో గోల్ మాల్

Ramagundam: రామగుండం కార్పొరేషన్ లో బతుకమ్మ చీరల పంపిణీ లో గోల్ మాల్

ఇప్పటివరకు చీరలు పంపిణీ చేయని కార్పోరేటర్ లు

- Advertisement -

చీరలు కావాలంటే కొర్రీలు పెడుతున్నారు.

ఆధార్ కార్డ్ తెల్ల రేషన్ కార్డ్ మహిళ ఫోటోలను డిజిటల్ ఫోటో తీస్తారట తర్వాత చీర ఇస్తారట

ఇదేం కండిషన్ అంటూ మహిళల అగ్రహం

పండుగ పూట మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్న పలువురు కార్పొరేటర్లు

రామగుండం, (తెలుగు ప్రభ) :కాంగ్రెస్ ప్రభుత్వం సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ప్రతి మహిళకు మంచి చీరలు అందించాలని ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చీరలు పంపించింది.మిగతా ప్రాంతాల్లో కొన్నిచోట్ల చీరల పంపిణీ జరిగిన,అందుకు భిన్నంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని 60 డివిజన్లో కార్పొరేటర్లకు పంపించిన బతుకమ్మ చీరల పంపిణీ లో గోల్ మాల్ జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొందరు కాంగ్రెస్ కార్పొరేటర్లు వారికి నచ్చిన మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారని వాదన వినిపిస్తుంది. దసరా పండుగకు ఇవ్వాల్సిన చీరలు ఇచ్చినట్టుగా రికార్డులో రాస్తూ చేతులు దులుపుకుంటున్నారు
ఆ చీరలు గుట్టలు గుట్టలుగా కార్పోరేటర్ ఇండ్లలో పడి ఉన్నాయి.

అధికారుల కార్పొరేటర్ల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు రేషన్ డీలర్ల ద్వారా స్వస్థత గ్రూప్ మహిళ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సూపర్వైజర్ పర్యవేక్షణలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ఆ ఇంట్లో ఎంత మంది మహిళలు ఉన్నారు గుర్తించి చీరలు పంపిణీ సక్రమంగా చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ డీలర్లను కాదని కార్పోరేటర్లకు చీరలు పంపిణీ చేయడం పట్ల ప్రజల నుండి తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి.37వ డివిజన్ కార్పొరేటర్ పజల్ బెగ్ ఇప్పటివరకు చీరలు పంపిణీ చేయకుండా మహిళా కాంగ్రెస్ నాయకురాలకు చీరలు అందజేయడం కిరాణా షాపుల్లో చీరలు ఇవ్వడం వివాదాలకు దారితీస్తుంది.

చీరల కోసం వచ్చే మహిళలను సదరు కార్పొరేటర్ మహిళలకు చీరలు కావాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు హోల్డర్ వస్తేనే డిజిటల్ ఫోటోలు తీసి తర్వాత చీరలను పంపిణీ చేస్తామనడం విడ్డరంగా ఉందని ఇదేం కండిషన్ అంటూ మండిపడుతున్నారు. కార్పొరేటర్ ఫజల్ బేగ్ ను కలవడానికి వెళ్లిన అందుబాటు లో ఉండగా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో మహిళలు కార్పొరేటర్ చుట్టూ తిరుగుతూ కార్పొరేటర్ స్పందించకపోవడం ఆగ్రహంతో ఉన్నారు.ఈ విషయమై తెలుగు ప్రభ రిపోర్టర్ 37వ డివిజన్ కార్పొరేటర్ ఫజల్ బేగ్ ను సంప్రదించి అడగగా పై నిబంధనలు ఉన్నాయని చెబుతున్నాడు.

దసరా పండుగ, సద్దుల బతుకమ్మ దగ్గరికి వచ్చింది ఇంకా చీరల పంపిణీ ఎప్పుడు చేస్తారు ఈ కండిషన్ ఏంటి అని అడిగితే సమాధానం దాటవేస్తున్నాడు కిరాణా షాపుల్లో మహిళా కాంగ్రెస్ నాయకురాలు చీరలు ఎందుకు ఇస్తున్నారు అని అడిగితే తన డిజిటల్ ట్యాగ్ ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ నాయకులకు కిరాణా షాపుల వారికి ఇస్తున్నానని అంటున్నాడు వాళ్ల దగ్గరికి వెళ్తే చీరలు అయిపోయారు చెబుతున్నారు అని మహిళల ఆరోపిస్తున్నారు. సగం తెలిసి సగం తెలియని కార్పొరేటర్లకు చీరలు పంపిణీ చేస్తే ఈ రకంగానే ఉంటుందని వాదనలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కమిషనర్ దృష్టి సారించి మహిళలకు కార్పొరేటర్ల నుండి కాకుండా రేషన్ డీలర్ల ద్వారా త్వరగా మహిళలకు అందజేస్తే పండుగకు అందరికీ మహిళలకు చీరలు అందే అవకాశం ఉంటుందని మహిళలు అంటున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో సద్దుల బతుకమ్మ పండుగ చీరల పంపిణీ సక్రమంగా లేకుండా అంతా గోల్మాల్ గందరగోళంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News