Homeతెలంగాణకరీంనగర్Field trip : నాలుగు గోడల క్లాస్‌రూమ్‌ దాటి... అడవుల్లో శాతవాహన విద్యార్థుల విజ్ఞాన...

Field trip : నాలుగు గోడల క్లాస్‌రూమ్‌ దాటి… అడవుల్లో శాతవాహన విద్యార్థుల విజ్ఞాన యాత్ర

కరీంనగర్‌ ( తెలుగు ప్రభ ) : తరగతి గది నాలుగు గోడల మధ్య నేర్చుకునే పాఠాల కంటే ప్రకృతి ఒడిలో ప్రత్యక్షంగా పొందే అనుభవాలే విద్యార్థి మేధస్సుకు అసలైన పదును పెడతాయి. పచ్చని వృక్ష సంపదతో అలరారే దండకారణ్యంలో విద్యార్థులు అడుగుపెడితే ఆ అన్వేషణ ఎలా ఉంటుంది? క్షేత్రస్థాయి పరిశీలన వారి శాస్త్రీయ దృక్పథాన్ని ఎలా మార్చింది? అనే ఆసక్తికర అంశాలను శాతవాహన విశ్వవిద్యాలయ వృక్షశాస్త్ర విద్యార్థుల విజ్ఞాన విహారం కళ్లకు కట్టింది.

- Advertisement -

అడవి బాటలో ప్రత్యక్ష అభ్యాసం: శాతవాహన విశ్వవిద్యాలయ వృక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ సాయిని కిరణ్‌ సారథ్యంలో విద్యార్థులు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రసిద్ధ జన్నారం అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. పుస్తకాల్లోని పాఠ్యాంశాలను ప్రకృతితో అనుసంధానిస్తూ, దట్టమైన అడవిలోని అరుదైన వృక్షజాతులు, అంతరించిపోతున్న సంప్రదాయ ఔషధ మొక్కలు, వన్యప్రాణుల ఆవాసాలను విద్యార్థులు ప్రత్యక్షంగా అధ్యయనం చేశారు.

అటవీశాఖ మార్గదర్శనం: పర్యటనలో భాగంగా ఫారెస్ట్‌ డివిజనల్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌డీవో) ఎం. మోహన్‌ రావు విద్యార్థులతో ముచ్చటించారు. జీవవైవిధ్య పరిరక్షణ, అడవుల విస్తరణలో వివిధ జాతుల మొక్కల కీలక పాత్రను ఆయన సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్‌ ఎల్‌. శ్రీనివాస్‌, డాక్టర్‌ శివకుమార్‌, డాక్టర్‌ అభినేశ్‌ పాల్గొని విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.

విజ్ఞానదాయకమైన ఈ అధ్యయన పర్యటన విజయవంతం కావడానికి పూర్తి సహకారం అందించిన ఉపకులపతి ఆచార్య ఉమేష్‌ కుమార్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య పి. సతీష్‌ కుమార్‌, సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌. రామకాంత్‌లకు వృక్షశాస్త్ర విభాగం కృతజ్ఞతలు తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News