జగిత్యాల టౌన్ (తెలుగు ప్రభ): శాసనమండలి ఉపనేత ఎమ్మెల్సీ ఎల్. రమణ 65వ జన్మదిన సందర్భంగా జగిత్యాల పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో పద్మశాలి సేవా సంఘ కార్యవర్గం ఆధ్వర్యంలో శ్రీ గాయిత్రి అమ్మవారి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పద్మశాలి సేవా సంఘం ప్రతినిధులు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు స్వామివారికి ఎమ్మెల్సీ ఎల్ రమణ పేరున ప్రత్యేక సంకల్పం చెప్పించి అర్చనలు జరిపించారు. బహుజన నేతగా ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న ఎల్. రమణ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా స్వామివారిని ప్రార్థించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు, స్థానికులకు తీర్థప్రసాదాలు తీసుకొని మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం బాధ్యులు, ప్రముఖులు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

