పెద్దపల్లి(తెలుగు ప్రభ): విద్యార్థుల్లో దేహదారుఢ్యంతోపాటు మానసిక వికాసానికి క్రీడలు ఎంతో అవసరమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. చదువుతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్‌లో నిర్వహించిన 70వ ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి అండర్–11, అండర్–14 బాలురు, బాలికల కరాటే సెలక్షన్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని, వారి ప్రతిభను అభినందించారు.
ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌తో పాటు కరాటే వంటి క్రీడల్లో పెద్దపల్లి ప్రాంత విద్యార్థులు, యువకులు ప్రతిభను చాటుతున్నారని తెలిపారు. జిల్లా స్థాయి పోటీల్లో సత్తా చాటి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై పెద్దపల్లి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తనవం


