Homeతెలంగాణకరీంనగర్Telangana Liberation Day: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

Telangana Liberation Day: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

సుల్తానాబాద్/ఎలిగేడు, (తెలుగుప్రభ): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ కప్పల ప్రవీణ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ విమోచన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుని వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కప్పల ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన కోసం ఎందరో చేసిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అమరవీరుల పోరాట స్ఫూర్తితో ప్రజలంతా ఐకమత్యంగా ముందుకు సాగుతూ గ్రామ, మండల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

తెలంగాణ చరిత్ర, విమోచన ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయడంతో పాటు ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సామాజిక ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి అంజలి, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, వీఓలు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read:Upasana Konidela: రాఘవేంద్ర స్వామి మఠంలో రామ్ చరణ్ సతీమణి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News