Homeతెలంగాణకరీంనగర్Jagtial:హ్యాట్రిక్ కొట్టిన వంశీధర్ రెడ్డి

Jagtial:హ్యాట్రిక్ కొట్టిన వంశీధర్ రెడ్డి

* పంచాయతీ కార్యదర్శుల జిల్లా అధ్యక్షుడిగా ముచ్చటగా మూడోసారి ఎన్నిక
* హోరాహోరీ పోరులో విజయం

- Advertisement -

మల్లాపూర్, (తెలుగు ప్రభ): జగిత్యాల జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడిగా మల్లాపూర్ మండల అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి ముచ్చటగా మూడోసారి ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి జిల్లా సంఘం పగ్గాలు చేపట్టారు. వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పంచాయతీ కార్యదర్శుల్లో ఆయనకు ఉన్న గుర్తింపును చాటుతోంది.

ప్రస్తుతం మల్లాపూర్ మండలంలోని కొత్త దాంరాజ్ పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న వంశీధర్ రెడ్డి, మండల సంఘం అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. మండల స్థాయి బాధ్యతలతో పాటు జిల్లా సంఘం అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్న ఆయనకు మూడోసారి అవకాశం దక్కడం ఆయన పనితనానికి నిదర్శనం.

జిల్లా సంఘం అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన వంశీధర్ రెడ్డికి పలువురు పంచాయతీ కార్యదర్శులు అభినందనలు తెలిపారు. కార్యదర్శుల సమస్యల పరిష్కారం, ఉద్యోగ సంబంధిత అంశాలపై సంఘం తరఫున సమన్వయం చేయడం, తమ గొంతుకను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో నూతన అధ్యక్షుడు కీలకంగా వ్యవహరించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News