Homeతెలంగాణకరీంనగర్Vemulawada: ఏసీబీకి పట్టుబడ్డ వేములవాడ రూరల్ తహసీల్దార్

Vemulawada: ఏసీబీకి పట్టుబడ్డ వేములవాడ రూరల్ తహసీల్దార్

సిరిసిల్ల, (తెలుగు ప్రభ): ఓ రైతు నుండి రూ.8 వేలు లంచం తీసుకుంటూ వేములవాడ రూరల్ తహసిల్దార్ అబూ బాకర్ ఎసిబికి పట్టుబడ్డాడు.
వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్, జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ అబూబకర్, కంప్యూటర్ ఆపరేటర్… ఓ ఫిర్యాదు దారిడి అత్తకు చెందిన వ్యవసాయ భూమిని గిఫ్ట్ డీడ్ ద్వారా తండ్రి పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు తహసిల్దార్ రూ.8వేలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

- Advertisement -

భూభారతి ఆపరేటర్‌గా పనిచేస్తున్న ప్రైవేట్ వ్యక్తి అనిల్ కుమార్ ద్వారా తహసీల్దార్ ఈ లంచం డబ్బులను స్వీకరించినట్లు తెలిపారు. ఏసీబీ అధికారులు అనిల్ కుమార్ వద్ద నుంచి రూ.8 వేల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. విధుల దుర్వినియోగానికి పాల్పడి అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు పేర్కొన్నారు.

అనంతరం తహసీల్దార్ అబూబకర్, అనిల్ కుమార్‌లను కరీంనగర్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉందని, ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News