HomeతెలంగాణKarimnagar: కరీంనగర్‌లో భారీ చోరీ.. 66 తులాల బంగారం, రూ. 21 లక్షల నగదు

Karimnagar: కరీంనగర్‌లో భారీ చోరీ.. 66 తులాల బంగారం, రూ. 21 లక్షల నగదు

Karimnagar: కరీంనగర్‌లో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లోకి ప్రవేశించి కత్తులు, తుపాకితో బెదిరించి దోపిడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. కరీంనగర్‌లోని భగత్‌నగర్‌ కాలనీలో నివాసముండే అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇంట్లోకి చొరబడిన ఆగంతకులు.. కుటుంబ సభ్యులను బంధించి, ఆయుధాలతో బెదిరించి ఇంట్లో ఉన్న 66తులాల బంగారం, రూ.21 లక్షల నగదు 10 తులాల వెండి ఎత్తుకెళ్లారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల జరిగి పీఎంజే దోపిడి ఘటన మరవకముందే ఈ ఘటన చోటుచేసుకోవడంతో నగరవాసులు భయాందోళనకు లోనవుతున్నారు.

- Advertisement -

కొట్టి తుపాకులతో బెదిరించి..
పోలీసులు సమాచారం ప్రకారం.. అజ్మత్ అలీ కుటుంబం భగత్ సింగ్ చౌరస్తాలోని ఓ ఇంట్లో మొదటి అంతస్తులో నివాసం ఉంటోంది. నిన్న రాత్రి పడుకునే ముందు రోజూలాగే కింది ఫ్లోర్‌లో ఉన్న లైట్ బంద్ చేసేందుకు వృద్ధుడు కిందకు వెళ్తున్న క్రమంలో అక్కడే మాటు వేసి ఉన్న దుండగులు అతడిని బంధించారు. అరవకుండా నోరు మూసి అక్కడి నుంచి ఇంట్లోకి తీసుకొచ్చి తల, ముఖంపై గట్టిగా కొట్టారు. ఇంట్లో ఉన్న యజమాని భార్య, ఇద్దరు కుమార్తెలను సైతం తీవ్రంగా కొట్టారు. అరిస్తే చంపేస్తామని తుపాకులు కత్తులతో బెదిరించారు. బాధితులను కట్టేసి ఇంట్లో ఉన్న 66 తులాల బంగారం, రూ. 21లక్షల నగదు, 10 తులాల వెండి ఎత్తుకు వెళ్లారు. ఎవరికీ ఫోన్ చేయకుండా వారి మొబైల్ ఫోన్లను సైతం వెంట తీసుకువెళ్లారు.

Also Read: CM Revanth: నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి నిరసన!

రెండు బైకులు కూడా
వెళ్లేముందు వారిని ఒకే గదిలో బంధించి కిందకు దిగారు. కింద పార్కింగ్‌లో ఉన్న రెండు బైక్‌లను చోరి చేసి వాటి మీదే పారిపోయారు. వేములవాడ బైపాస్ మీద నుంచి నిందితులు పరారైనట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు సైతం బయటకు వచ్చాయి. తెలిసిన వ్యక్తులే ఈ దోపిడికి పాల్పడి ఉంటారని ఇంటి యజమాని ఆరోపిస్తున్నారు. పెద్ద అల్లుడిపైనే అజ్మత్‌ అలీ అనుమానం వ్యక్తం చేశారు. వచ్చిన వ్యక్తులు ఉత్తరాది హింది భాష మాట్లాడారని, తన అల్లుడు సైతం ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వాడని ఇంటి యజమాని పోలీసులతో పేర్కొన్నారు. ఇంట్లో బంగారం ఉందని తెలిసి అందులో నివాసం ఉండే వాళ్లు సైతం.. వృద్ధులు, ఆడవాళ్లు కావడంతో లక్ష్యంగా ఎంచుకున్నారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News