Kavitha Kalvakuntla TRS: రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలపైన ‘తెలంగాణ రక్షణ సేన’ మాట్లాడుతుందని.. పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తాము సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా ముందుకు వస్తున్నామని పేర్కొన్నారు. శనివారం బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. ధాన్యం కుప్పలపైనే రైతులు ప్రాణాలు విడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/newly-married-couple-commits-suicide-in-kukatpally/
సర్వోదయ తెలంగాణ సాధించటం కోసం ’పాంచజన్యం’ అనే ఐదు అంశాలను తీసుకున్నామని కవిత పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే ఈ ఐదు అంశాలను అమలు చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ జాగృతిపై కవిత స్పందించారు. 20 ఏళ్ల పాటు సాగిన తెలంగాణ జాగృతి స్వచ్చంద సంస్థగా అలాగే కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
పేదలకు నాణ్యమైన, ఉచిత విద్య అందాలని కవిత అన్నారు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా ఉచితంగా వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వాలు ఇస్తున్న హామీల వల్ల ఉపాధి అంటే హాస్యాస్పదమైందని కవిత విమర్శించారు. ఉపాధి కల్పన అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదని.. యువత, మహిళలు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. వారిని వ్యాపారులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు.
Also Read: https://teluguprabha.net/telangana/mla-danam-nagender-react-to-kalvakuntla-kavitha-comments-on-kcr/
‘రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా వస్తామని చెప్పాం వచ్చాం. అన్ని అడ్డంకులను దాటుకొని తెలంగాణ రక్షణ సేన పేరుతో రాజకీయ ఫ్లాట్ ఫామ్‌ను ఏర్పాటు చేసుకున్నాం. ప్రజల గొంతుకగా సమస్యలను ఎత్తిచూపే వేదికగా పనిచేస్తాం. అన్ని అంశాలపై మాట్లాడుతాం. ప్రజల తరఫున పోరాడుతాం. అధికార, ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తాం.- కవిత కల్వకుంట్ల

