KCR Fire on Revanth Reddy: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా దిగజారిపోయిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/cm-chandrababu-review-on-electricity-department/
రాష్ట్రంలో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని కేసీఆర్ అన్నారు. పంటలు చేతికి రాక, ధాన్యం కొనే నాథుడు లేక పరిస్థితి “బొందల పడ్డట్టు” తయారైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదన్న కేసీఆర్.. ఇది “చిల్లర ప్రభుత్వం”గా అభివర్ణించారు. పంట వేసిన దగ్గర నుంచి కొనే వరకు గతంలో బీఆర్‌ఎస్ అండగా నిలిస్తే.. ఇప్పుడు ప్రభుత్వం ధాన్యం కొనడం చేతకాక రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. సుమారు 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని.. ఎండిన పంటలకు ఎకరానికి రూ. 25 వేల నష్టపరిహారం ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు సరైన సపోర్ట్ అందడం లేదని.. 24 గంటల విద్యుత్, రైతుబంధు వంటి పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ తప్పుబట్టారు. ఆ సమయంలో బీఆర్‌ఎస్ ఎంపీలు ఉంటే లోక్‌సభ రణరంగం అయ్యేదని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు దీనిపై స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. లోక్ సభలో బీఆర్‌ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించిందని వెల్లడించారు. తెలంగాణ పట్ల బీఆర్ఎస్‌కు ఉన్న చిత్తశుద్ధి ఎవరికీ ఉండదని స్పష్టం చేశారు.
‘తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ విషయంలో నేను ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. హైదరాబాద్‌తో కూడిన రాష్ట్రాన్ని గట్టిగా కొట్లాడి సాధించాం. ఎన్నో సందర్భాల్లో నన్ను మానసిక క్షోభకు గురి చేశారు. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించేందుకే పొత్తు పెట్టుకున్నాం. అశోక్ గులాటీ అనే మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు రైతు బంధు పథకం తెచ్చా. పక్క రాష్ట్రాల ప్రజలు పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి వస్తుంటే ఈ ప్రభుత్వం గేట్లు తీయలేదు. ఇది చిల్లర ప్రభుత్వం….ఆ మాటలు ఏంటి..ఆ కూతలు ఏంటి.?’ – కేసీఆర్

