HomeTop StoriesKCR Metting: పైరవీలు పనిచేయవు.. పనిచేసే వారికే టికెట్‌.. తెగేసి చెప్పిన కేసీఆర్‌..!

KCR Metting: పైరవీలు పనిచేయవు.. పనిచేసే వారికే టికెట్‌.. తెగేసి చెప్పిన కేసీఆర్‌..!

KCR serious warning to BRS Leaders: ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌లో పార్టీ ముఖ్యనేతలతో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఇన్‌చార్జుల నియామకం, జిల్లా, మండల, గ్రామ కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. అయితే, పనిచేయని నాయకులకు ఈసారి టిక్కెట్‌ ఇచ్చేది లేదని, పైరవీలు చెల్లవని అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరంతరం ప్రజల్లో ఉండే వారికే టికెట్‌ దక్కుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతి, ఆరు గ్యారెంటీ హామీల అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/international-news/bomb-blasts-in-pakistan-crowded-market/

రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కండి..

పార్టీ కార్యక్రమాలు, సభలు, సమావేశాల నిర్వహణపై కూడా కేసీఆర్ బీఆర్‌ఎస్‌ క్యాడర్‌కు పలు కీలక సూచనలు చేశారు. జిల్లా పరిషత్, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కార్పొరేషన్ల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణపై బీజేపీ ఫోకస్, ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైనా చర్చించారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులకు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News