HomeతెలంగాణCM Revanth Reddy: కేసీఆర్ కుటుంబం విచ్చలవిడి దోపిడీ

CM Revanth Reddy: కేసీఆర్ కుటుంబం విచ్చలవిడి దోపిడీ

అధి­కా­రాన్ని అడ్డు­పె­ట్టు­కొని కేసీ­ఆర్‌ కుటుంబం విచ్చ­ల­వి­డిగా భూముల దోపి­డీకి పాల్ప­డిందని, బీఆ­ర్‌­ఎస్ హయాంలో లక్ష కోట్ల భూ కుంభ­కోణం జరి­గిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ, అసైన్డ్‍, భూదాన్‌ భూము­లను దోచు­కు­న్నారని, ధరణి పేరుతో కేసీ­ఆర్‌ కుటుం­బమే కాకుండా ఆ పార్టీకి చెందిన నేతలు సైతం ఎక్కడ పడితే అక్కడ నిషే­ధిత భూము­లను తమ పేర్ల­పైకి మార్చు­కు­న్నారని సీఎం ధ్వజమెత్తారు. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో 22ఏ నిషేధిత భూములపై మాట్లాడ్డారు. ఇంకా ఏమన్నారంటే…

- Advertisement -

భూ కుంభ­కో­ణంపై స్పెషల్‌ ఎంక్వ­యిరీ టీమ్‌ (ఎస్­ఈటీ)ను ఏర్పాటు చేస్తాం. గత బీఆ­ర్‌­ఎస్ ప్రభుత్వం ఎన్నడూ కనీ­వినీ ఎరు­గని రీతిలో భూ అక్ర­మా­లకు పాల్ప­డింది. మాజీ ముఖ్య­మంత్రి కేసీ­ఆ­ర్‌కు చెందిన ఎర్ర­వల్లి ఫాంహౌస్ పరి­ధి­లోని భూము­లపై సమగ్ర విచా­ర­ణకు ఆదే­శాలు జారీ చేస్తున్నాం. వందల ఎక­రాల ప్రభుత్వ భూమి కేసీ­ఆర్‌ ఫాంహౌస్ ఆధీ­నంలో ఉందనే ఆరో­ప­ణలు ఉన్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసు­కున్నాం. కేసీ­ఆర్‌ ఎర్ర­వల్లి ఫాంహౌస్ సరి­హ­ద్దులు, ఆక్ర­మ­ణ­లపై 30 రోజుల్లో విచా­రణ పూర్తి చేసి నివే­దిక సమ­ర్పిం­చా­లని రెవెన్యూ అధి­కార యంత్రాం­గాన్ని ఆదే­శి­స్తున్నా. నిబం­ధ­నల ప్రకారం మాజీ సీఎం కేసీ­ఆ­ర్‌కు తక్ష­ణమే నోటీ­సులు జారీ చేయాలి. నిర్ణీత సమ­యం­లోగా విచా­రణ పూర్తి చేయ­డంలో ఏమైనా నిర్లక్ష్యం వహిస్తే బాధ్యు­లైన అధి­కా­రులు, సంబం­ధిత మంత్రు­లపై కూడా కఠిన చర్యలు ఉంటాయి. తెలం­గాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్య­మాన్ని అడ్డం పెట్టు­కుని కేసీ­ఆర్‌ భారీగా ఆస్తు­లను కూడ­బె­ట్టారు.

కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబానికి 440 ఎకరాలు

కేసీ­ఆర్‌, కల్వ­కుంట్ల కుటుం­బా­నికి వివిధ ప్రాంతాల్లో సుమారు 440 ఎక­రాల భూమి ఉంది. 700 ఎక­రాల ఫాంహౌస్ కేసీ­ఆ­ర్‌కు ఉందో? లేదో తేల్చాలి. అందులో 388 ఎక­రాల ప్రభుత్వ భూమి ఉందనే విషయం కేసీ­ఆర్‌ ఎందుకు చెప్ప­లేదు? సిద్ది­పే­టలో కేసీ­ఆర్‌ కుటుం­బా­నికి 67.5ఎక­రాలు, కేటీ­ఆర్‌ కుటుం­బా­నికి 123 ఎక­రాలు, హరీ­శ్‌­రావు కుటుం­బా­నికి 30 ఎక­రాలు, కల్వ­కుంట్ల కవిత కుటుం­బా­నికి 37 ఎక­రాలు, జోగి­న­పల్లి సంతో­ష్‌­రావు కుటుం­బా­నికి 79 ఎక­రాలు, నవీ­న్‌­రా­వుకు 52 ఎక­రాలు, కొండ­ల్‌­రా­వుకు 48 ఎక­రాలు ఉంది. కల్వ­కుంట్ల కుటుం­బా­నికి 9 జిల్లా­ల్లోని 24 మండ­లాల్లో 31 గ్రామాల్లో 439 ఎక­రా­లు­న్నాయి కేటీ­ఆర్‌ జన్వాడ ఫాంహౌ­స్పై నేనెం­దుకు బాంబులు వేస్తా? నేనే­మైనా బిన్‌­లా­డె­న్‌నా ? స్టీఫె­న్‌­స­న్‌కు ఎన్ని­కల ముందు నజ­రానా ఇచ్చారు. రూ.50 కోట్ల భూమిని రూ.1.53 కోట్లకే రెగ్యు­ల­రైజ్‌ చేశారు. గంగుల, ఎర్ర­బెల్లి, సుధీ­ర్‌­రెడ్డి 650 ఎక­రాల ప్రభుత్వ భూమి కొను­గోలు చేశారు. జగ­దీ­శ్‌­రెడ్డి 50ఎక­రాల ఫాంహౌ­స్లో 11.5 ఎక­రాల ఇనాం భూమి ఎలా వచ్చింది. ? పైలట్‌ రోహి­త్‌­రెడ్డి అజీ­జ్‌­న­గ­ర్‌లో అసైన్డ్‍ భూమిలో ఫాంహౌస్ కట్టు­కు­న్నారు. ల్యాండ్‌ సీలింగ్‌ చట్టం ప్రకారం ఒక కుటుం­బా­నికి గరి­ష్టంగా కుష్కి పొలం 54, తరి పొల­మైతే 27 ఎక­రా­లుం­డాలి. కానీ, కేసీ­ఆ­ర్‌కు ఉన్నది మొత్తం తరి పొలమే అని సీఎం రేవంత్‌ రెడ్డి వివ­రిం­చారు.

ఫాం హౌస్ భూములను దళితులకు పంచుతా
అధికారుల దర్యాప్తులో కేసీఆర్‌ ఫాంహౌస్ పరిధిలో ఉన్న భూమి ప్రభుత్వ భూమిగా తేలితే, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం. ఆ భూమిని ఎర్రవల్లి ఫాం హౌస్ వద్ద నిరసన తెలిపిన దళితులకు, పేదలకు పంచుతాం. పేదల హక్కులను కాపాడడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. బీఆర్‌ఎస్ నాయకులు భూ అక్రమాలు చేశారని ఆరోపిస్తూ, మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి ఇనాం భూములను తన పేరు మీదకు మార్చుకున్నారు.
రోహిన్‌ రెడ్డి అసైన్డ్‍ భూముల్లో ఫాంహౌస్ నిర్మించుకున్నారు. బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‍ కోసం కేటాయించిన భూములతో పాటు ఎల్బీనగర్‌ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, గంగుల కమలాకర్‌ ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కొల్లగొట్టారు. రాష్ట్రంలో 74 ఎకరాల భూదాన్‌ భూములపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి గతంలో తీవ్రంగా పోరాటం చేశారు. కానీ ప్రస్తుతం ఆ భూములు అన్యాక్రాంతమైపోయాయి.

సునీతా లక్ష్మారెడ్డి, సబితపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు
మాజీ మంత్రులు సునీతా లకా్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిపై నేను ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. సీఎల్పీ నాయకుడిగా ఉన్న ఒక దళితుడికి అన్యాయం చేసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవులు అనుభవించారు. దొరల వద్ద బానిసలుగా ఉండాల నుకుంటే ఉండవచ్చు. కిషన్‌ రెడ్డి సొంత గ్రామంలో ఆక్రమణకు గురైన భూములపై విచారణ జరిపించాలని ముందుగా సబితా ఇంద్రారెడ్డి కోరాలి.

చర్చకు రావొద్దనే కుట్ర
కొంత­మం­దిని చరిత్ర ఎప్పుడూ క్షమిం­చదు. గతంలో జరి­గిన తప్పు­లపై సభలో చర్చ జరు­గు­తుం­దనే ప్రధాన ప్రతి­పక్షం కుట్ర చేసింది. ప్రభుత్వ భూము­లను కొల్ల­గొ­ట్టిన అంశాలు చర్చకు రావొ­ద్దని, ఫీజు రీయిం­బర్స్​‍ మెంట్‌, కరు­వుపై, కొంత­మంది చేసిన క్షుద్ర పూజలు చర్చలు వస్తా­యని సభ మొదటి రోజే కుట్ర పూరి­తంగా వ్యవ­హ­రిం­చారు. మా ప్రభు­త్వా­నికి ప్రతీ ఆడ­బిడ్డ సమా­నమే. ఆడ­బి­డ్డల ఆత్మ­గౌ­ర­వాన్ని కాపా­డా­ల­నేదే మా ప్రభుత్వ సంకల్పం. కోటి మంది ఆడ­బి­డ్డ­లను కోటీ­శ్వ­రు­లను చేయా­లని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టు­కుంది. సభా­ప­తిని గౌర­విం­చడం సభ్యుల సంప్ర­దాయం. సభలో ప్రతీ సభ్యుడి హక్కు­లను కాపా­డేది సభా­పతి. గత ప్రభు­త్వమే సభ నిర్వ­హ­ణపై కొన్ని నిబం­ధ­నలు రూపొం­దిం­చింది.

ఆ నిబంధనల మేరకే సభాపతి ఆదేశాలు
ఆ నిబం­ధ­నల మేరకే సభా­పతి ఆదే­శాలు ఇచ్చారు. సభా­పతి ఇచ్చిన ఆదే­శా­లను గేట్‌ 3 వద్ద పోలీ­సులు అమలు చేశారు. పార్ల­మెం­ట్‌లో రాహుల్‌ గాంధీ నల్ల టీషర్టు వేసు­కుని వెళ్లా­రని ప్రతి­పక్ష నాయ­కులు మాట్లాడు తున్నారు. నినా­దా­లతో కూడిన టీష­ర్టు­లతో లోప­లకి రాకూ­డ­దని స్పీకర్‌ ఆదే­శా­లిస్తే వారు పాటించే వారు. లోక సభ స్పీకర్‌ పార్ల మెంటులో అలాంటి నిబం­ధ­నలు విధిం­చ­లేదు. కానీ శాస­న­స­భలో ఎలాంటి నిబం­ధ­నలు ఉండాలో గత ప్రభు­త్వమే రూపొం­దిం­చింది. పోలీ­సు­లపై దూషించి, అర్ధ నగ్న ప్రద­ర్శన చేసి, సభా­ప­తిని కూడా దూషిం­చారు. దీనిపై సభా­ప­తికి క్షమా­పణ చెప్పి సమ­స్య­లపై చర్చ చేస్తా­రని భావించి మీరు వారిని సభ­లోకి అను­మ­తిం­చారు. కానీ విచ­క్షణ కోల్పోయి వ్యవ­హరిం చడం వల్లే వారిని మీరు సస్పెండ్‌ చేశారు. వారు సభకు రాలే­దని ప్రజా సమ­స్య­లపై చర్చించే భాధ్య­తను విస్మ­రిం­చ­లేదు.

ఎల్బీనగర్‌ స్థలాలను క్రమబద్ధీకరిస్తాం
ఎల్బీ­న­గ­ర్‌లో జీవో 118 పరి­ధిలో ఉన్న­వా­రం­ద­రికీ త్వరలో శుభ­వార్త చెబుతాం. ఎల్బీ నగర్‌ నియో­జ­క­వ­ర్గంలో స్థలా­లను రెగ్యు­ల­రైజ్‌ చేస్తాం. జీవో 118 కింద పెండింగ్‌ దర­ఖా­స్తులు నిర్ణీత గడు­వులో పరి­ష్క­రిస్తాం. ఈ ప్రాంతంలో 9,500 మంది బాధి­తులు ఉన్నారు.

మజ్జిగ పలుచనైంది.. అందుకే భూములపై దొర కన్ను
ధరణి దోపిడీ వల్ల లక్షల కోట్ల ఆస్తి కొందరు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. మా మంత్రి కొంచెం ముక్కుసూటి మనిషి… అందుకే ఆయన మీద కొంత కోపం పెంచుకున్నారు. రజాకర్ల సమయం తప్పిస్తే.. మిగిలిన నిజాం పాలన అద్భుతమైన పాలన. కాస్రా పహాణీలో కబ్జా కాలంలో ఎక్కువ పేదలు ఉండే వాళ్లు. ధరణిలో అసలు కబ్జా కాలమే తీసేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను కాలరాస్తూ.. కాస్రా పహాణీ తిసేశారు. కేసీఆర్‌… వచ్చాక మండల స్థాయిలో ఉన్న రికార్డుల వ్యవస్థ కలెక్టర్‌కి వచ్చింది. ధరణి పోర్టల్‌ అంటే రికార్డులు కంప్యూటరైజ్‌ చేయడమే. కానీ అక్కడే కుట్ర చేశారు. భూముల కోసం పోరాటం చేసింది ఎర్రజెండా అయితే, భూములు పంచింది కాంగ్రెస్. సీలింగ్‌ యాక్ట్‍ చేసింది కాంగ్రెస్. పేదలు భూ హక్కులు అనుభవిస్తున్నారంటే.. దానికి కారణం ఇందిరాగాంధీ. ఇందిరమ్మ మీద వాళ్లో .. వీళ్లో వెకిలి మాటలు మాట్లాడతారు. కానీ భూములు పంచిన ఘనత ఇందిరమ్మది. కాళేశ్వరంలో మంది ఎక్కువై మజ్జిగ పలచన అయ్యింది. మజ్జిగ రుచి దొరకు నచ్చలేదు. అప్పుడే భూమిపై పడింది దొర కన్ను. అందుకు వాడిన అస్త్రం ధరణి. 2010లో ఒడిస్సాలో ధరణి ప్రారంభం అయింది. కానీ కేసీఆర్‌.. నేనే మెదడు రంగరించి ధరణి తెచ్చిన అన్నాడు. ఒడిస్సాలో తెచ్చిన ధరణిని కాగ్‌ తిట్టిన తిట్టూ తిట్టకుండా తిట్టింది. ఆ సమయంలో కేసీఆర్‌ ధరణి తెచ్చి పెట్టాడు.

3 లక్షల 77 వేల ఎకరాల మీదనే పంచాయితీ
నేను కేసీఆర్‌ను పదే పదే సభకు రమ్మని ఎందుకు అడిగానంటే.. ధరణి చిట్టా అంతా చెప్పాలని రమ్మన్నా. అందుకే బబుల్‌ షూటర్‌… కేసీఆర్‌ను సభకు రావొద్దని చెప్పాడు. ధరణి పోర్టల్‌ నిర్వహణకు ఐదేళ్లకు రూ. 58 కోట్లు… కానీ రూ.1300 కోట్లకు ఎలా పెరిగింది? వీటిపై సమాధానం వాళ్లు చెప్పు కోవాలి కదా? అసెంబ్లీకి రావడానికి ఆయనకు గుండెలు లేవు. ల్యాండ్‌ రికార్డ్‍ అప్డేట్‌ చేయాలి అంటే పార్ట్‍ ఏ, పార్ట్‍ బీగా చేశారు. పార్ట్‍ బీ అంతా నిషేధిత జాబితాలో పెట్టారు. నిషేధిత జాబితా ధరణి తోనే వచ్చింది. 21 లక్షల 93 వేల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారు. రైతులు తిరిగి తిరిగి అలిసి పోయారు. దళారులు, దోపిడీదారులు దోచు కున్నారు. దళారులు… దోపిడీదారులు వేరు వేరు కాదు. ఇద్దరూ ఒకరే… వాళ్లే బీఆర్‌ఎస్ వాళ్లు. 98 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితాలో ఉండాల్సిందే. అటవీ, అసైన్డ్‍, దేవాలయ భూములు నిషేధిత జాబితాలో ఉండాల్సిందే. ఇందులో నుంచి ఒక్క ఇంచ్‌ భూమి కూడా తీయొద్దు. ప్రైవేట్‌ వ్యక్తుల భూములు 3 లక్షల 77 వేల ఎకరాల మీదనే పంచాయితీ. అగ్గిపెట్టె రావు కోటి ఎకరాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

నిషేధిత జాబితాలో ఉన్న భూములు తొలగించండని కేసీఆర్‌తో లేఖ రాయించు. మేం భూములు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు కొల్లగొట్టడానికి ఏం చేశారో కూడా చెప్తా. 2025లో రికార్డులు సెట్‌ చేసి సమస్య పరిష్కారం కోసం భూ భారతి తెచ్చాం. 22 ఏ మేం తెచ్చింది కాదు… ఉమ్మడి ఏపీలో తెచ్చిన చట్టం. 1999లో 22 ఏ తెచ్చారు. హైకోర్టు ఆదేశాలతో 2025లో కలెక్టర్‌ల నుంచి జాబితా తెచ్చి నిషేధిత జాబితాలో పెట్టాం. ధరణి నుంచి 7 లక్షల పై చిలుకు ఎకరాలు నిషేధిత జాబితాలో ఉంది . 2026 కి 3 లక్షల పై చిలుకు తగ్గింది. ఇకపై 22ఏ లో చేర్చాలి అన్నా…కొన్ని విధానాలు పెట్టుకున్నాం. రెండు అంశాను ప్రభుత్వం గుర్తించింది అని సీఎం అన్నారు.

త్వరలో ధరణి పార్ట్ 2 .. అన్నీ బయటపెడుతా

రాష్ట్రంలో మొత్తం రూ.లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగింది. భూ కుంభకోణంపై స్పెషల్‌ ఎంక్వయిరీ టీమ్‌ (ఎస్ఈటీ) ఏర్పాటు చేస్తాం. మొత్తం భూ కుంభకోణంపై నెల రోజుల్లో నిగ్గు తేలుస్తాం. ఇప్పటి వరకు చెప్పింది ధరణి పార్ట్‍ – 1 మాత్రమే. త్వరలోనే ధరణి పార్ట్‍ – 2 అక్రమాలు బయ టపెడతాం. బీఆర్‌ఎస్ సభ్యులు సభలో ఉన్నప్పుడే అన్నీ బయటపెడతాం. ఈ సారి సమావేశాలకు బీఆర్‌ఎస్ సభ్యులు వచ్చేలా స్పీకర్‌ చూడాలి. నా కళ్లలోకి చూసి మాట్లాడే ధైర్యం వాళ్లకు ఉండదు. టీజీఐఐసీ భూముల్లో జరిగిన అక్రమాలను బడ్జెట్‌ సెషన్‌లో బయటపెడతా. ధరణిని అడ్డు పెట్టుకొని రూ.వేల కోట్లు దోచుకు న్నారు. 22ఏ సమస్యల పరిష్కారానికి హైపవర్‌ ఆఫీసర్స్​‍ కమిటీ ఏర్పాటు చేస్తాం. సమస్యల పరిష్కారానికి వారంలోపు సమగ్ర గైడ్‌లైన్స్​‍ తీసుకొ స్తాం. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ లేఔట్ల దరఖాస్తులు పరిశీలిస్తాం. పెండింగ్‌లో ఉన్న, కొత్తగా వచ్చే దరఖాస్తులను పరిష్కరిస్తాం. సమస్యల పరిష్కారానికి వారం లోపు వ్యవస్థ తీసుకొస్తాం.

సిరిసిల్లలో 8వేల ఎకరాలు బదలాయించారు
ధర­ణిని అడ్డం పెట్టు­కుని… భూదాన్‌ భూము­లను పట్టా చేసు­కు­న్నారు. ఫారెస్ట్‍ భూముల నుంచి 106 ఎక­రాల భూమి గండ్రకు అప్ప­గిం­చారు. ఈ విష­యంలో కలె­క్ట­ర్‌ను సుప్రీం­కోర్టు తిట్టింది. కేటీ­ఆర్‌ ప్రాతి­నిధ్యం వహి­స్తున్న సిరి­సి­ల్లలో 8 వేల అసైన్డ్‍ భూములు బద­లా­యిం­చారు. సందీప్‌ ఝా ను కలె­క్ట­ర్‌గా వేస్తే 2 వేల ఎక­రాలు బయ­టకు తీశారు. మైహోమ్‌ రామే­శ్వర రావుకు ఎయి­ర్పోర్ట్‍ కు అను­కుని 2647 ఎక­రాల భూమి కట్ట­బె­ట్టారు. ప్రజల సొమ్ము ఇలా కొల్ల­గొ­డ­తారా? కాప్రాలో.. అవేక్యు ప్రాపర్టీ అని రాయిం­చారు నమస్తే తెలం­గా­ణలో. తర్వాత ధరణి తెచ్చి బద­లా­యిం­చారు. మేల్ల­చె­రు­వులో భూదాన్‌ భూములు లాక్కు­న్నారు. మైహోమ్‌ 113 ఎక­రాలు సిమెంట్‌ ఫ్యాక్టరీ కి వాడు­కుం­టు­న్నారు. అసైన్డ్‍ భూములు, వక్ఫ్‍ భూములు అన్ని మై హోమ్‌ వాళ్ళు లాక్కో­వచ్చా? భూములు ఎక్కడ కని­పిం­చినా గద్దల లెక్క వాలి­పో­యారు.

లక్ష కోట్ల భూములు లాక్కు­న్నారు. ఈ చర్చ రాకుండా ఉండా­లనే సభలో గంద­ర­గోళం చేయా­లని చూశారు. ఆడ­బి­డ్డ­లను అడ్డం­పె­ట్టు­కుని అడ్డు­కో­వాలి అను­కు­న్నారు. శిశు­పా­లు­నికి కూడా వంద తప్పులు చేస్తేనే శిక్ష పడింది. ఏ రాక్ష­సు­డికి అయినా సమయం వస్తుంది… అప్పుడే శిక్ష పడు­తుంది. 22ఏ ను అడ్డం­పె­ట్టు­కుని మాపై నిందలు వేయా­లని చూశారు. మేం అన్నీ బయట పెడు­తున్నాం. సంగా­రెడ్డి లో భూముల చిట్టా కూడా బయట పెడతా. ఇలాంటి వాళ్లను మనం క్షమిస్తే.. మనల్ని భవి­ష్యత్‌ తరాలు క్షమిం­చవు. వీట­న్నిం­టిపై ఎస్­ఈటీ(స్పెషల్‌ ఎంక్వ­యిరీ టీమ్‌ విచా­ర­ణకు సిఫార్సు చేస్తున్నా. సామాన్య ప్రజల సమస్య పరి­ష్కారం చేసేలా కమిటీ ఏర్పాటు చేస్తున్నాం.

22ఏ నిషేధిత భూములపై ప్రభుత్వం తీసుకునున్న చర్యలు

  1. సెక్షన్‌ 22-ఏ నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న భూములు, ఆస్తులకు సంబంధించి పెండింగ్‌ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు చేపడుతుంది. మొత్తం 12రకాల సమస్యలు గుర్తించించామని సీఎం అస్లెంబ్లీలో వివరించారు.
  2. యుఎల్సీ భూముల క్రమబద్ధీకరణకు త్వరలో కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం పాత పెండింగ్‌ దరఖాస్తులతో పాటు కొత్త దరఖాస్తులకూ వర్తించనుంది. రిజిస్ట్రేషన్‌, క్రమబద్ధీకరణ ప్రక్రియలను సమాంతరంగా చేపట్టనున్నట్లు తెలిపింది.
  3. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, డీటీసీపీల అధీకృత లేఅవుట్లలోని ప్రభుత్వ భూముల పెండింగ్‌ రిజిస్ట్రేషన్‌ దరఖాస్తులను పరిశీలించేందుకు వారం రోజుల్లో సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.
  4. సింగరేణి కోల్‌బెల్ట్‍ ప్రాంతాల సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేయనుంది.
  5. జీవో నం.59 కింద కన్వేయెన్స్​‍ డీడ్స్​‍ జారీ చేసిన 1,22,280 దరఖాస్తులను అర్హతల ఆధారంగా తుది పరిశీలన చేసి క్లియర్‌ చేయనుంది. మరో 18,590 పెండింగ్‌ దరఖాస్తులను నూతన క్రమబద్ధీకరణ విధానం ద్వారా పరిష్కరించనుంది.
  6. జీవో నం.118కు సంబంధించిన పెండింగ్‌ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించి, పరిష్కారమైన కేసులను
    వెంటనే 22-ఏ జాబితా నుంచి తొలగించనుంది.
  7. అసైన్డ్‍ భూముల్లో నిర్మించిన ఇళ్ల విషయంలో సమగ్ర న్యాయ సమీక్ష, ఉన్నతస్థాయి సంప్రదింపులు చేపట్టనుంది.
  8. ఇందిరమ్మ పథకం కింద ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో నిర్మించిన ఇళ్లపై విస్తృత సంప్రదింపులు జరపనుంది.
  9. ఇందిరమ్మ పథకం లబ్ధిదారుల సొంత స్థలాల్లో ప్రభుత్వ వ్యయంతో నిర్మించిన ఇళ్లకు ఐదేళ్ల లాక్‌-ఇన్‌ పీరియడ్‌ అనంతరం క్రయవిక్రయాలకు అనుమతించనుంది.
  10. ప్రైవేట్‌ పట్టా భూముల్లో నాలా రుసుము చెల్లించని కేసుల్లో స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ రుసుములతో పాటు
    నాలా ఛార్జీలు చెల్లించి క్రయవిక్రయాలకు అనుమతించనుంది.
  11. ప్రభుత్వ భూముల్లోని అనధికార లేఅవుట్లు, కాలనీలను నూతన క్రమబద్ధీకరణ పథకం పరిధిలోకి తీసుకురానుంది.
  12. సికింద్రాబాద్‌ పరిధిలోని లీజుహోల్డ్​‍ ఆస్తుల ఫ్రీహోల్డ్​‍ క్రమబద్ధీకరణకు 30 రోజుల్లో అధికారుల కమిటీని ఏర్పాటు చేయనుంది.
  13. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల అసైన్మెంట్‌ భూములు, భూదాన్‌ భూములను ల్యాండ్‌ పూలింగ్‌ పథకం పరిధిలోకి తీసుకొచ్చి, సమీకరించిన వనరులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నిరుపేదల గృహ నిర్మాణానికి వినియోగించే విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News