HomeTop StoriesBetupalli: బేతుపల్లి చెరువులో పెను ప్రమాదం: 10 మంది కానిస్టేబుళ్లు గల్లంతు

Betupalli: బేతుపల్లి చెరువులో పెను ప్రమాదం: 10 మంది కానిస్టేబుళ్లు గల్లంతు

Betupalli Lake SDRF Boat Accident: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో పెను విషాదం చోటుచేసుకుంది. మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన పోలీస్ కానిస్టేబుళ్లు ప్రమాదానికి గురయ్యారు.బేతుపల్లి చెరువులో ఐదుగురు మత్స్యకారులను కాపాడే క్రమంలో ఈ ఘటన జరిగింది.బలమైన గాలి, నీటి ప్రవాహానికి రెండు SDRF బోట్లు ఒక్కసారిగా తిరగబడ్డాయి.గల్లంతైన 10 మంది కానిస్టేబుళ్ల కోసం గజ ఈతగాళ్లు, రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు.

- Advertisement -

ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.ఘటనాస్థలి వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్లు గల్లంతు.. మంత్రి పొంగులేటి సమీక్ష

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని బేతుపల్లి చెరువులో ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్లు గల్లంతైన ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆరా తీశారని, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు.

మురసు తుపాను ప్రభావంతో బేతుపల్లి చెరువు వద్ద చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం బోటు తిరగబడిన విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌తో పాటు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు తక్షణమే అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు గల్లంతైన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సమీప ప్రాంతంలో సురక్షితంగా ఉన్నట్లు గుర్తించాయి. వారిని మరో గంటలోగా ఒడ్డుకు చేర్చేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు మంత్రికి వివరించారు.

సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకునే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన రక్షణ పరికరాలు, బోట్లు అందుబాటులో ఉంచడంతో పాటు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సహాయక చర్యల పురోగతిని జిల్లా కలెక్టర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడి సమీక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు గురువారం ఉదయం ఘటనా స్థలానికి వెళ్లనున్నట్లు వెల్లడించారు.

Also Read: Penuballi: లంకాసాగర్ ప్రాజెక్ట్ నిండటంతో గంగాదేవికి ప్రత్యేక పూజలు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News