Homeతెలంగాణఖమ్మంBhadrachalam Temple : వైభవంగా సీతారాముల నిత్య కల్యాణం

Bhadrachalam Temple : వైభవంగా సీతారాముల నిత్య కల్యాణం

భద్రాచలం, (తెలుగు ప్రభ): దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. సుప్రభాత సేవ, అర్చన, ఆరాధన, బాలభోగం నిర్వహించి అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.

- Advertisement -

అనంతరం ఉత్సవమూర్తులను వధూవరులుగా అలంకరించి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ మిథిలా స్టేడియంలోని శ్రీరామ మండపానికి తీసుకెళ్లారు. అక్కడ పుణ్యావచనం, యజ్ఞోపవీత ధారణ, స్వామివారి ప్రవర ప్రవచనం తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించి శ్రీ సీతారాముల నిత్య కల్యాణాన్ని కన్నుల పండువగా జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కే. దామోదర్‌రావు, అర్చకులు లింగాల సాయిబాబా, వేద పండితులు, ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News