Homeతెలంగాణఖమ్మంCrocodile : చేప కోసం వల... ఎర కోసం ముసలి, వేటకు వెళ్లిన వ్యక్తికి షాక్!

Crocodile : చేప కోసం వల… ఎర కోసం ముసలి, వేటకు వెళ్లిన వ్యక్తికి షాక్!

దుమ్ముగూడెం, (తెలుగు ప్రభ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామ సమీపంలోని గోదావరి వద్ద మొసలి కనిపించడం కలకలం రేపింది. స్థానికంగా చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి గోదావరిలో గాలం వేసిన కొద్దిసేపటికే ఏదో చిక్కింది. పెద్ద చేప పడిందని భావించి ఆనందంగా గాలాన్ని బయటకు లాగగా.. చేపకు బదులుగా చిన్న మొసలి కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు.

- Advertisement -

చేప కోసం వేసిన ఎరను తినేందుకు వచ్చిన మొసలి గాలానికి చిక్కినట్లు తెలుస్తోంది. ఊహించని విధంగా మొసలి బయటకు రావడంతో ఏం చేయాలో తెలియక సదరు వ్యక్తి గాలంతో సహా మొసలిని అక్కడే వదిలేసి భయంతో పరుగులు తీశారు. అనంతరం ఘటన విషయాన్ని స్థానికులకు తెలియజేయడంతో తూరుబాక గ్రామంలో కలకలం రేగింది. గోదావరి పరిసరాల్లో మొసళ్లు సంచరిస్తున్నాయనే సమాచారంతో మత్స్యకారులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గోదావరి వద్దకు చేపల వేటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత అటవీశాఖ అధికారులు స్పందించి మొసలి సంచారంపై పరిశీలన చేపట్టి ప్రజలకు తగిన హెచ్చరికలు జారీ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News