Bhadrachalam: గత కొద్ది రోజులుగా ఉగ్రరూపం చూపిస్తున్న గోదావరి ప్రస్తుతం శాంతిస్తోంది. ఆదివారం ఉదయం 10 గంటలకు 46.7 అడుగుల వద్దకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. 10.83లక్షల క్యూసెక్కుల వరద దిగువకు ప్రవాహిస్తోంది. ప్రవాహం తగ్గడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు.
వరద ప్రవాహం తగ్గే…
ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతోంది. సాయంత్రానికి వరద ప్రవాహం తగ్గే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. భద్రాచలంతో పాటు దుమ్ముగూడెం,చర్ల,బూర్గంపాడు మండలాల్లో రహదారుల పైకి చేరిన వరద నీరు కూడా తగ్గడంతో ప్రజలు కొంచెం పీల్చుకున్నారు.దీంతో రాకపోకలు కూడా సాగుతున్నాయి.
మరోవైపు బూర్గంపాడు మండలంలోని సారపాక, మోతే గ్రామాల్లో ఇళ్ల వరకు చేరిన వరద నీరు కూడా వెనక్కి తగ్గుతుంది.దీంతో పునరావాస కేంద్రాల్లో ఉన్న వారు వరద బాధితులు ఇళ్లకు చేరుకుంటున్నారు.
Also Read: Telangana: ఐఎండీ హెచ్చరిక.. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్

